Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
పోషకాలు పుష్కలంగా సూపర్ టేస్టీ మునగాకు చట్నీ..ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా పర్ఫెక్ట్.. నెలల తరబడి నిల్వ
భారతీయ భోజనంలో చట్నీలకు (పచ్చళ్లకు) ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎంతటి చప్పటి భోజనమైనా, కాస్త ఘాటైన, రుచికరమైన చట్నీ తోడైతే కంచం ఖాళీ అవ్వాల్సిందే. మనం సాధారణంగా కొత్తిమీర, పుదీనా, టమాటా, మామిడికాయ, పల్లీల చట్నీలను తరచుగా తింటూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా అద్భుతమైన మునగాకు చట్నీ రుచి చూశారా?

ఆరోగ్యానికి అమృతం లాంటి ఈ మునగాకుతో చేసే చట్నీ.. అటు రుచికి రుచిని, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయుర్వేదంలో మునగాకును ఒక దివ్యౌషధంగా భావిస్తారు. ఇందులో మన శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ A, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మునగాకు చట్నీకి కావాల్సిన పదార్థాలు
లేత మునగాకులు - రెండు కప్పులు
ఆవ నూనె లేదా వంట నూనె- 3 టీస్పూన్లు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - అర కప్పు
ఎండు కొబ్బరి పొడి లేదా తురుము - అర కప్పు
తెల్ల నువ్వులు - ఒక టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5 నుండి 7
పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి - 1
ఉప్పు - రుచికి సరిపడా
మునగాకు చట్నీ తయారీ విధానం
-మునగాకు చట్నీ చేయడానికి ముందుగా తాజాగా ఉండే లేత మునగాకులను ఎంచుకోండి. ఆకులను కాడల నుండి విడదీసి ముక్కలుగా చేసుకుని, నీటిలో రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో తడి లేకుండా ఆరబెట్టుకుంటే చట్నీ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో రెండు టీస్పూన్ల ఆవ నూనె పోయండి. నూనె వేడెక్కాక శుభ్రం చేసుకున్న మునగాకులను వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. ఆకులు మెత్తబడి, పచ్చివాసన పోయి బాగా ఉడికే వరకు మగ్గనివ్వాలి. ఉడికిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో మరో టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇవి కాస్త వేగాక వేరుశెనగ గుళ్లు వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత, అరకప్పు కొబ్బరి తురుము, ఒక టీస్పూన్ తెల్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-వేయించి పెట్టుకున్న మునగాకులు, పల్లీలు-కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వాటన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీనిని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... చట్నీ రుబ్బేటప్పుడు పొరపాటున కూడా నీళ్లు కలపకూడదు.
-నీళ్లు చుక్క లేకుండా చేసుకున్న ఈ కమ్మని మునగాకు పొడి చట్నీని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇది మీకు నెలల తరబడి తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీతో తింటే ఆ రుచే వేరు. అలాగే రోటీలు, చపాతీలు, ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది మంచి సైడ్ డిష్ గా అమరుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
