Latest Updates
-
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
నోట్లో వేస్తే కరిగిపోయే బేకరీ స్టైల్ బాదుషా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా చేయండి!
పండుగైనా, పెళ్లయినా, ఇంట్లో మరేదైనా శుభకార్యమైనా అందరికీ ముందుగా గుర్తొచ్చేది తీపి పదార్థమే. అందులోనూ బేకరీ అద్దాల వెనుక రాజులా కొలువుదీరే బాదుషాను చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కసారి కొరికితే అమృతం తిన్నంత ఆనందాన్ని ఇస్తుంది. అయితే బేకరీలో దొరికే ఈ రుచికరమైన బాదుషాను ఇంట్లో చేస్తే గట్టిగా వస్తుందని, నూనె ఎక్కువ పీల్చేస్తుందని చాలామంది భయపడుతుంటారు. సరైన కొలతలు, చిన్నపాటి చిట్కాలు పాటిస్తే, మీ ఇంట్లోనే బేకరీని మించిన బాదుషాలు తయారుచేయవచ్చు.

బాదుషా తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి: 2 కప్పులు
బొంబాయి రవ్వ: 1 టేబుల్ స్పూన్
నెయ్యి లేదా దాల్డా: పావు కప్పు
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా: పావు టీస్పూన్
పంచదార: 2 కప్పులు
నీళ్లు: తగినన్ని
యాలకుల పొడి: చిటికెడు
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
వేయించడానికి: సరిపడా నూనె లేదా నెయ్యి
అలంకరణకు: సన్నగా తరిగిన పిస్తా పప్పులు
బాదుషా తయారీ విధానం
-పర్ఫెక్ట్ బాదుషా తయారీ రహస్యమంతా పిండిని కలుపుకోవడంలోనే దాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు నీళ్లు, నెయ్యి (లేదా దాల్డా), పెరుగు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి తేలికగా బ్రెడ్ పొడిలాగా కలపాలి. చపాతీ పిండిలా గట్టిగా అస్సలు పిసకకూడదు. అలా గట్టిగా పిసికితే బాదుషాలో పొరలు రావు. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తని ముద్దలా చేసి, సుమారు 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల చక్కెర, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. చక్కెర కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. పాకం సిద్ధమయ్యాక స్టవ్ ఆపేసి, అందులో యాలకుల పొడి, నిమ్మరసం కలపాలి. నిమ్మరసం వల్ల పాకం చల్లారాక గడ్డకట్టకుండా ఉంటుంది.
-ఇప్పుడు నానబెట్టిన పిండిని చిన్న చిన్న నిమ్మకాయంత ఉండలుగా చేసుకోవాలి. అరచేతిలో పెట్టుకుని సున్నితంగా నొక్కుతూ, మధ్యలో బొటనవేలితో చిన్న గుంటలా చేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువగా వేడెక్కకూడదు. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో బాదుషాలను వేసి, మంటను తగ్గించాలి. అవి వాటంతట అవే పైకి తేలేవరకు గరిటె పెట్టి కదపకూడదు. బాదుషాలు పైకి తేలాక, రెండు వైపులా తిప్పుతూ బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించాలి.
-దోరగా వేగిన బాదుషాలను నూనెలోంచి తీసిన వెంటనే, గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో వేయాలి. కనీసం 5 నిమిషాల పాటు పాకంలో నాననిస్తే, ఆ తీపినంతా బాదుషా లోపలి వరకు పీల్చుకుంటుంది. ఆ తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని, పైన సన్నగా తరిగిన పిస్తా పలుకులతో అలంకరిస్తే.. నోట్లో ఇట్టే కరిగిపోయే పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ బాదుషాలు రెడీ.
-బాదుషాలను గాలి చొరబడని ఒక గాజు జాడీలో భద్రపరుచుకుంటే పది రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications