Latest Updates
-
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?
మండే ఎండలకు చెక్.. వడదెబ్బను తరిమికొట్టే పచ్చి మామిడి - ఉల్లి చట్నీ!
ఎండాకాలంలో ఉక్కపోత, విపరీతమైన ఎండల వల్ల సహజంగానే మన శరీరానికి ఆకలి మందగిస్తుంది. కడుపులో ఏదైనా చల్లగా, తేలికగా ఉండే ఆహారం పడితే బాగుంటుందనిపిస్తుంది. నోటికి రుచిగా అనిపించే పదార్థాల కోసం మనసు ఆరాటపడుతుంది.
ఇలాంటి సమయంలో మన ముందున్న ఒక అద్భుతమైన భారతీయ సూపర్ ఫుడ్ పచ్చి మామిడి, ఉల్లిపాయ చట్నీ. తీపి, పులుపు, కొద్దిగా కారం కలగలిసిన ఈ చట్నీని ఒక్కసారి రుచి చూస్తే, ప్రాణానికి లేచివచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం భోజనం రుచిని పెంచడమే కాదు, మండే ఎండల్లో శరీరాన్ని చల్లబరిచే అద్భుత ఔషధంలా పనిచేస్తుంది.

వేసవిలో విరివిగా దొరికే పచ్చి మామిడికాయ మన శరీర వేడిని అమాంతం తగ్గించి, శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇక ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వడదెబ్బ తగలకుండా కాపాడటంలో ఉల్లిపాయను మించినది లేదు. ఈ రెండింటి కలయికతో చేసే చట్నీ వేసవి కాలంలో మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా మారుతుంది.
పచ్చి మామిడి-ఉల్లిపాయ చట్నీ తయారీకి కావలసిన పదార్ధాలు
-పచ్చి మామిడికాయ
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-బ్లాక్ సాల్ట్
-బెల్లం
-వేయించిన జీలకర్ర పొడి
-పుదీనా
పచ్చి మామిడి-ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకుని, శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు, ఒకటి లేదా రెండు ఉల్లిపాయల ముక్కలు, మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్), తగినంత నీరు పోసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
-దీని రుచిని మరింత బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం కానీ, పంచదార కానీ కలుపుకోవచ్చు. ఇది చట్నీకి అద్భుతమైన తీపి-పులుపు రుచిని ఇస్తుంది. కొంతమంది వేయించిన జీలకర్ర పొడి లేదా గుప్పెడు తాజా పుదీనా ఆకులను కూడా జతచేస్తారు. పుదీనా వేయడం వల్ల చట్నీకి వచ్చే తాజాదనం, సువాసన వర్ణనాతీతం.
-ఈ పచ్చి మామిడి, ఉల్లిపాయ చట్నీని వేసవిలో మీ రోజువారీ భోజనంలో ఒక పర్ఫెక్ట్ సైడ్ డిష్‌గా వడ్డించుకోవచ్చు. వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకుని, నంజుకోవడానికి ఈ చట్నీ ఉంటే ఆ ఆనందమే వేరు. రోటీలు, పరాఠాలు, లేదా సాయంత్రం వేళ తినే స్నాక్స్ తో కూడా ఇది అద్భుతంగా సెట్ అవుతుంది.
-కడుపుకి ఎలాంటి భారం అనిపించని ఈ తేలికపాటి చట్నీ, మన సాధారణ భోజనానికి సైతం కొత్త రుచిని, జీవాన్ని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications