For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ కోసం కాకరకాయ జ్యూస్ - బరువు తగ్గే రసం రెసిపి: ప్రిపరేషన్

Posted By:
|

మీకు భారత్ ను 'డయాబెటిస్ రాజధాని’ అంటారని తెలుసా? మన దేశంలో 50 మిలియన్లకి పైగా జనాభా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. సరైన సమయంలో ఈ వ్యాధిని గుర్తించటం, మందు తీసుకోవటంవలన ఈ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మేము రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ప్రభావవంతమైన సహజచిట్కాలను కూడా మీకు అందించాలనుకుంటున్నాం.

కాకరకాయ లేదా కరేలా మనందరికీ నచ్చీనచ్చకుండా ఉండే ఒక కాయగూర.మనందరికీ దాని ప్రాముఖ్యత తెలుసు, కానీ మన భోజనంలో దాన్ని తినడానికి ఇష్టపడం! మళ్ళీ ఒకసారి ఈ మంచి కాయగూర/పండును పడేసేటప్పుడు,ముందు ఇది చదవి ఆలోచించండి!

పరిశోధనల్లో తేలింది ఏమిటంటే ప్రతిరోజూ మీ డైట్ లో కాకరకాయ రసాన్ని జతచేయటం వలన, రోజుకి ఒకసారి తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అదే కాదు, ఈ రసంలో చాలా విటమిన్లు,ఖనిజలవణాలు, ఆహారంలో ఉండే పీచు ఉండివుంటాయి,ఇది బరువు తగ్గటంలో కూడా సాయపడుతుంది, ఎక్కువ తినకుండా, ఎక్కువసేపు కడుపు నిండివుండేట్లా చేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

కాకరకాయలో మధుమేహ వ్యతిరేక లక్షణాలు పూర్తిగా ఉంటాయి. చారన్టిన్,పాలీపెప్టైడ్ 2 లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి సాయపడటమేకాక గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో పూర్తిగా యాంటీఆక్సిడెంట్లు నిండివుండటం వలన, ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది, వయస్సు మీరకుండా చర్మకణాలను కాపాడుతుంది, అలాగే శరీరంలో వాపులు రాకుండా చేస్తుంది.

మీరెప్పుడు దాన్ని తాగాలి?

ఈ కాకరకాయ రసాన్ని తాగటానికి మంచి సమయం పొద్దున్నే పరగడపున, ఖాళీ కడుపున తాగాలి.కాఫీ కూడా తాగకముందే దీన్ని తాగాలి. కానీ మీకు ఎసిడిటీ ఉన్నట్లయితే, మధ్యాహ్నం భోజనం తర్వాత తాజా రసంలాగా తాగండి.

ఈ మొత్తం కాకరకాయ రసం రెసిపి తెలుసుకోడానికి, వీడియో చూడండి లేదా కింద రెసిపి చదవండి.

డయాబెటిస్ కోసం కాకరకాయ రసం రెసిపి । బరువు తగ్గే రసం రెసిపి । కాకరకాయ రసం వీడియో
డయాబెటిస్ కోసం కాకరకాయ రసం రెసిపి । బరువు తగ్గే రసం రెసిపి । కాకరకాయ రసం వీడియో
Prep Time
5 Mins
Cook Time
3M
Total Time
8 Mins

Recipe By: ప్రీతి

Recipe Type: కాయగూరల రసం

Serves: 1

Ingredients
 • 1.కాకరకాయ -1-2

  2.నిమ్మకాయ -1/2

  3.పసుపు-పావుచెంచా

  4.ఉప్పు- చిటికెడు

How to Prepare
 • 1.కాకరకాయను తీసుకుని సరిగ్గా కడగండి.

  2.పై తొక్కు తీసేసి విత్తనాలు తొలగించండి.

  3.కాకరకాయను చిన్న ముక్కలుగా తరిగి,బౌల్ లో వేయండి.

  4.ఒక చిటికెడు ఉప్పును వేసి 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టండి.

  5.రసం తీయడానికి, తరిగిన ముక్కలను మిక్సీలో వేసి నీళ్ళు పోయండి.

  6.మిక్సీ పట్టి రసం తీసి దానిపై ఉప్పు,పసుపును చల్లండి.

  7. కొన్ని చుక్కల నిమ్మరసాన్ని రుచికోసం చల్లండి.మీ రసం రెడీ!

Instructions
 • 1.మీరు చేదును చాలారకాలుగా తగ్గించవచ్చు. విత్తనాలతో పాటుగా, పై తొక్కును కూడా తీసేయండి. ఇంకా ఉప్పునీళ్ళలో నానబెట్టి చేదు ఎంత సులభంగా పోతుందో చూడండి. 2.మీకు ఈ రసం కొంచెం పల్చగా కావాలి అన్పిస్తే, ఎక్కువ నీళ్ళు పోయండి.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం – - 1 గ్లాసు
 • క్యాలరీలు - 11 క్యాలరీలు
 • కొవ్వు - 0.1గ్రా
 • ప్రొటీన్ - 0.7 గ్రా
 • పీచుపదార్థం - 1.7గ్రా
[ 5 of 5 - 83 Users]