Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
చపాతీ, నాన్ లోకి ది బెస్ట్ కాంబినేషన్.. నోరూరించే పనీర్ యఖ్ని..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మనం హోటల్ స్టైల్ అని పనీర్ బటర్ మసాలా లేదా కడై పనీర్ వంటివే ఎక్కువగా చేస్తుంటాం. కానీ ఎప్పుడూ ఒకే రకమైన రుచిని ఆస్వాదించడం ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. అందుకే ఈసారి మీ కుటుంబ సభ్యులను సర్ప్రైజ్ చేయడానికి కాస్త భిన్నంగా పనీర్ యాఖ్ని ట్రై చేయండి. ఇది ప్రసిద్ధ కాశ్మీరీ వంటకం.
ఘాటైన మసాలాలు, కమ్మనైన పెరుగు, జీడిపప్పు మిశ్రమంతో తయారయ్యే ఈ కూర చపాతీ, రోటీ లేదా నాన్ లోకి అద్భుతంగా ఉంటుంది. పనీర్ యాఖ్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ధనియాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు -అర టీస్పూన్
కాశ్మీరీ ఎండుమిర్చి - 4
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 3
యాలకులు - 2
నానబెట్టిన జీడిపప్పు - 10
గట్టి పెరుగు -అర కప్పు
పచ్చి పనీర్ ముక్కలు - 4
నూనె - 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
పనీర్ - 200 గ్రాములు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
ఎర్ర మిర్చి- 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ -అర టేబుల్ స్పూన్
పంచదార - అర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీరు - అర కప్పు
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, కాశ్మీరీ ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-అదే మిక్సీ జార్ లో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు, పెరుగు, 4 పచ్చి పనీర్ ముక్కలను వేయండి. వీటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక పనీర్ ముక్కలను వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-అదే నూనెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎర్ర మిర్చి ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి
-ఇప్పుడు అదే పాన్ లో సిద్ధం చేసుకున్న జీడిపప్పు-పెరుగు మిశ్రమాన్ని పోయండి. నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై కలపండి. ఇది కాస్త చిక్కబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపాక అర కప్పు నీరు పోసి గ్రేవీని బాగా మరిగించండి.
-గ్రేవీ మరుగుతున్నప్పుడు పంచదార వేయండి. తర్వాత వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు, వేయించిన ఉల్లిపాయ మిశ్రమాన్ని గ్రేవీలో వేసి బాగా కలపండి. మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన పనీర్ యఖ్ని రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






