Latest Updates
-
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా.. -
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ భుర్జీ మసాలా గ్రేవీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే..
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే
ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ. కానీ, అప్పుడప్పుడు వెరైటీగా, ఆరోగ్యకరంగా ఏదైనా తినాలనిపిస్తే మాత్రం కొత్తిమీర పొంగలి అద్భుతమైన ఎంపిక. పొంగలి అనగానే గుడిలో పెట్టే ప్రసాదం గుర్తొస్తుంది.. అదే ప్రసాదం రుచికి కాస్త కొత్తిమీర తాజాదనం తోడైతే ఆ రుచే వేరు. కొత్తిమీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది. మరి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ కమ్మని కొత్తిమీర పొంగలిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కొత్తిమీర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి బియ్యం - అర కప్పు
పెసరపప్పు - అర కప్పు
కొత్తిమీర - ఒక పెద్ద కట్ట (శుభ్రం చేసింది)
పచ్చిమిరపకాయలు - 3
నీళ్లు - 3 కప్పులు
పసుపు - చిటికెడు
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - పావు కప్పు
జీడిపప్పులు - గుప్పెడు
నల్ల మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సన్నగా తరిగిన అల్లం - 1 టేబుల్ స్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర పొంగలి తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో అర కప్పు పెసరపప్పు వేసి, సన్నని మంటపై పచ్చివాసన పోయేలా దోరగా వేయించండి. ఇప్పుడు పచ్చి బియ్యం కూడా వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 3 కప్పుల నీళ్లు, చిటికెడు పసుపు, 1 టీస్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూతపెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి.
-పొంగలి ఉడికేలోపు, ఒక మిక్సీ జార్ లో కడిగి పెట్టుకున్న తాజా కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోండి.
-కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత, మూత తీసి అన్నం-పప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మ్యాష్ చేయండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్, 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. కొత్తిమీర పచ్చివాసన పోయి, అన్నానికి ఆకుపచ్చ రంగు పట్టేలా ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వండి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
-పొంగలికి ప్రాణం నెయ్యి తాలింపే. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, దంచిన మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీడిపప్పులు వేసి వేయించండి. జీడిపప్పులు బంగారు రంగులోకి మారుతున్నప్పుడు కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
-ఈ ఘుమఘుమలాడే నెయ్యి తాలింపును ఉడుకుతున్న పొంగలిలో వేసి బాగా కలపండి. అంతే ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొత్తిమీర పొంగలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
