Latest Updates
-
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!
రోజూ అవే ఇడ్లీ, దోశలు తిని బోర్ కొడుతోందా? అయితే ఈ పాపడ్ దోశ ట్రై చేయండి!
బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ అవే ఇడ్లీ, దోశ, ఉప్మా, బోండా తినేవారితో పాటు వాటిని తయారుచేసే కుటుంబసభ్యులకు కూడా అవే చేస్తూ బోర్ కొడుతుంది. వంట చేసేవారికి కూడా కొత్తగా, అప్పటికప్పుడు ఏదైనా రుచికరంగా చేయాలని ఉంటుంది. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో, ఎక్కువ శ్రమ లేకుండా అందరినీ మెప్పించే అదిరిపోయే వంటకం..ప్రముఖ సెలిబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ పరిచయం చేసిన పాపడ్ దోశ(Papad Dosa). పేరు వినడానికి కాస్త వింతగా అనిపించినా, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూశారంటే మీరు దీన్ని మళ్లీ మళ్లీ చేసుకుంటారు.

సాధారణంగా దోశ వేయాలంటే ముందురోజు పప్పులు నానబెట్టాలి, పిండి రుబ్బాలి, అది పులిసే వరకు ఆగాలి. కానీ ఈ పాపడ్ దోశకు ఆ శ్రమేమీ ఉండదు. ఇది అప్పటికప్పుడు వేసుకునే ఇన్ స్టంట్ వంటకం. దీనికోసం కేవలం మన ఇంట్లో ఉండే అప్పడాలు, కొద్దిగా నీళ్లు, నూనె లేదా నెయ్యి ఉంటే చాలు. అకస్మాత్తుగా ఆకలి వేసినా, ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చినా, లేదా పిల్లలు స్కూల్ బాక్స్ కోసం వెరైటీ అడిగినా.. నిమిషాల్లో ఈ దోశను తయారు చేయవచ్చు. ఇది చాలా క్రిస్పీగా, కరకరలాడుతూ అద్భుతమైన రుచితో ఉంటుంది.
పాపడ్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
అప్పడాలు (పాపడ్స్) - 10
నీళ్లు - తగినన్ని
నూనె లేదా నెయ్యి - కాల్చడానికి సరిపడా
చాట్ మసాలా
సన్నగా తరిగిన పచ్చిమిర్చి
ఉల్లిపాయ ముక్కలు
పాపడ్ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో పది అప్పడాలను వేయాలి. అవి మెత్తబడే వరకు కాసేపు నీటిలో ఉంచాలి. అప్పడాలు పూర్తిగా తడిసి, మెత్తగా మారిన తర్వాత వాటిని నీటిలోంచి జాగ్రత్తగా బయటకు తీయాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన అప్పడాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా (దోశ పిండిలా) రుబ్బుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-తర్వాత స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ పాన్ లేదా పెనం పెట్టాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నీళ్లు చల్లి పొడి గుడ్డతో తుడవాలి. ఇప్పుడు ఒక గరిటెడు అప్పడాల పిండిని తీసుకుని పెనంపై గుండ్రంగా, పల్చగా దోశలా పరచాలి. దోశ చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. మీడియం మంట మీద దోశను కాల్చాలి. అడుగు భాగం లేత బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా తయారయ్యాక మరోవైపు తిప్పుకుని కాల్చుకోవాలి.
-అంతే వేడివేడి, కరకరలాడే పాపడ్ దోశ రెడీ. దీనిని కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా వేడివేడి సాంబార్ తో వడ్డిస్తే రుచి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
