Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
రోజూ తినే పల్లీ చట్నీ బోర్ కొట్టిందా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ కొత్తిమీర చట్నీ ట్రై చేయండి!
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మామిడికాయల సందడి మొదలవుతుంది. ఘుమఘుమలాడే ఆవకాయ పచ్చడి దగ్గరి నుంచి.. మామిడికాయ పప్పు, పులిహోర, సాంబార్, జామ్.. ఇలా ఎన్నో రకాలుగా మనం మామిడిని ఆస్వాదిస్తాం. కొందరికైతే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు, కారం చల్లుకుని తింటే వచ్చే మజాయే వేరు.
అయితే ఉదయం పూట తినే వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి పచ్చి మామిడికాయతో ఒక అద్భుతమైన చట్నీ చేసుకోవచ్చని మీకు తెలుసా? రోజూవారీ పల్లీ చట్నీ, టమాటా, కొబ్బరి చట్నీలకు భిన్నంగా.. ఈ వేసవిలో మీ నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా ఏదైనా కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటే మామిడికాయ కొత్తిమీర చట్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. పచ్చి మామిడికి, తాజా కొత్తిమీర తోడైతే ఆ రుచి ఎన్నో రెట్లు పెరుగుతుంది. కేవలం ఐదు నిమిషాల్లో ఈ చట్నీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

మామిడికాయ కొత్తిమీర చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
తాజా కొత్తిమీర ఆకులు - 3 కప్పులు
పుదీనా ఆకులు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం ముక్క - 2 అంగుళాలు
వెల్లుల్లి రెబ్బలు - 3
పచ్చి మామిడికాయ ముక్కలు - అర కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - పావు కప్పు
మామిడికాయ కొత్తిమీర చట్నీ తయారీ విధానం
-ముందుగా కొత్తిమీర, పుదీనా ఆకులను నీటిలో శుభ్రంగా కడగాలి. పచ్చి మామిడికాయను తీసుకుని, పైన ఉన్న తొక్కను తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి దీనిలో పావు కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. చట్నీని రుబ్బుతున్నప్పుడు, అందులో ఒకటి లేదా రెండు ఐస్ క్యూబ్స్ వేయండి. ఇలా చేయడం వల్ల చట్నీ నల్లబడకుండా, మంచి ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా ఉంటుంది.
-ఈ చట్నీ నునుపుగా ఉంటేనే రుచిగా ఉంటుంది. కాబట్టి మెత్తని పేస్ట్ లా అయ్యేదాకా రుబ్బుకోండి. మీరు తీసుకున్న మామిడికాయలో పులుపు సరిపోలేదు అనిపిస్తే, కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది.
-అంతే ఘుమఘుమలాడే మామిడికాయ కొత్తిమీర చట్నీ రెడీ. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని, వేడి వేడి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు లేదా చపాతీలతో వడ్డిస్తే మీ కుటుంబ సభ్యులు ఈ కొత్త రుచికి ఫిదా అవ్వడం ఖాయం.
-ఈ చట్నీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో వాడిన పుదీనా, అల్లం జీర్ణశక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు, డైట్ చేసేవారు ఎలాంటి సంకోచం లేకుండా ఈ చట్నీని లాగించేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
