Latest Updates
-
మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ.. ఇలా చేస్తే అచ్చం హోటల్ రుచి పక్కా! -
ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు, బూజు.. వీటిని తినడం సురక్షితమేనా.? -
అమ్మ పెళ్లి కుదిర్చిందని గుండు గీయించుకున్న యువతి.. నెట్టింట వైరల్.. పుకారా, నిజమా.? -
చిన్నారుల ఫేవరెట్.. లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రసం రైస్.. కొత్తగా ఇలా చేయండి.! -
భాగస్వామితో గొడవైనప్పుడు పొరపాటున కూడా ఇలా చేయకండి.! -
‘తక్షణ మెరుపు’ అపోహ.. చర్మ సంరక్షణలో అతివలు చేస్తున్న అతిపెద్ద తప్పులు ఇవే.! -
ఫోలిక్ యాసిడ్ ఒక్కటే కాదు.. కాబోయే తల్లికి అత్యవసరమయ్యే పోషకాలు ఇవే.! -
పోషకాల మినుములతో లడ్డూలు, దోశలే కాదు.. వేడివేడి అన్నంలోకి అదిరే రోటి పచ్చడి.! -
దూరం పెరిగినా బంధం మారదు.. యువతని ఆకట్టుకుంటున్న 'కాక్టస్ ఫ్రెండ్షిప్'.! -
నోటి పూతలతో ఏం తినాలన్నా ఇబ్బందే.. ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో ఇట్టే రిలీఫ్.!
తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై..దీని కోసం యుద్ధాలు చేసినా తప్పేలేదు..ఎలా చేసుకోవాలంటే
తెలంగాణ వంటకాలు.. ప్రత్యేకమైన రుచులు, ఘాటు సుగంధ ద్రవ్యాలు, సంప్రదాయ పద్ధతులకు ప్రసిద్ధి. వాటిల్లో బోటి ఫ్రై టాప్ ప్లేస్ లో ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు ఇది ఒక కనుల పండుగ, నోరూరించే వంటకం. సాధారణంగా బోటి ఫ్రైని గారెలు, రోటీ లేదా అన్నంతో తింటారు. దీని తయారీకి కాస్త సమయం పట్టినా, చివరకు లభించే అద్భుతమైన రుచి అన్ని శ్రమలను మరచిపోయేలా చేస్తుంది. మేక లేదా గొర్రె పేగులు ఉపయోగించే చేసే ఈ వంటకాన్ని సరిగ్గా శుభ్రపరిచి వండితే ఇది అత్యంత రుచికరమైన వంటకాల్లో ఒకటిగా మారుతుంది. తెలంగాణలో బోటిని చాలా శుభ్రంగా కడిగి, రుచికరమైన మసాలాలతో ఫ్రై చేస్తారు. తెలంగాణ నాటు స్టైల్ లో బోటీ ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మటన్ బోటీ
-ఆయిల్
-జీలకర్ర
-పచ్చి మిరపకాయలు
-ఉల్లిపాయ
-టమాటో
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-కరివేపాకు
-జీరా పౌడర్
-ఉప్పు
-కారం

బోటీ ఫ్రై తయారీ విధానం
-ముందుగా బోటీని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు,పసుపు వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చీలికలుగా కట్ చేసుకోండి.
-తర్వాత టమాటోను పొడవాటి ముక్కలుగా,5 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఉడికించిన బోటీ వేసి అది మునిగేంత నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి
-బోటీ పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాత కుక్కర్ ని తీసి పక్కన పెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద ఇనుప కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులోనే తరగిన ఉల్లిపాయలు వేసి పెద్ద మంట మీద 2 నిమిషాలు కలుపుతూ వేయించాక ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక అందులో కట్ చేసిన టమాటో వేసి ఒకసారి బాగా కలిపాక అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు,అర టీస్పూన్ పసుపు వేసి వేయించాలి.
-టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలపండి.
-తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి తర్వాత ఉడికించిన బోటీ ఇందులో వేసి మంచిగా కలిపాక మూతపెట్టి 3 నిమిషాలు మూతపెట్టి పెద్ద మంటమీద మగ్గించాలి.
-తర్వాత మూతతీసి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,2 టేబుల్ స్పూన్ల కారం,అర టీస్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి 5 నిమిషాలు తక్కువమంట మీద మగ్గించాలి.
-తర్వాత కొత్తిమీర తరుగు వేసి మళ్లీ మూతపెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే తెలంగాణ స్టైల్ బోటీ కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications