Latest Updates
-
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి! -
జుట్టు రాలడం తగ్గాలంటే.. వారానికోసారి ఈ కరివేపాకు ఎగ్ రైస్ తినాల్సిందే!..లంచ్ బాక్స్ కి బెస్ట్ -
ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్ లు వాడే సీక్రెట్ ఇదే! -
ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు! -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.! -
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.!
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!
ఎప్పటిలాగే చేసే ఒకే రకమైన చికెన్ కూర తిని మీకు బోర్ కొట్టిందా? మీ కుటుంబ సభ్యులను ఒక సరికొత్త రుచితో ఆశ్చర్యపరచాలనుకుంటున్నారా? అయితే గోవా స్టైల్ చికెన్ మసాలాను ఓ సారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.
గోవా అనగానే మనకు అందమైన బీచ్‌లు మాత్రమే కాదు, నోరూరించే అక్కడి స్థానిక వంటకాలు కూడా గుర్తుకు వస్తాయి. గోవా స్టైల్ చికెన్ మసాలా వేడి వేడి అన్నం, బిర్యానీతోనే కాకుండా.. దోసె, చపాతీ, పూరీ, పరోటా వంటి వాటితో అద్భుతమైన కాంబినేషన్‌గా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే గోవా చికెన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోవా స్టైల్ చికెన్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ - అర కేజీ
ఉల్లిపాయ - 1
టమాటాలు - 3
వంట నూనె - 3 టేబుల్ స్పూన్లు
వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - మీ రుచికి తగినంత
అసలైన గోవా మసాలా పేస్ట్ కోసం
అల్లం - 1 చెంచా
వెల్లుల్లి - 8 రెబ్బలు
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
మెంతులు - 2 చెంచాలు
జీలకర్ర - 2 చెంచాలు
ఎండు మిరపకాయలు - 4
లవంగాలు - 4
పసుపు పొడి - అర చెంచా
మిరియాల పొడి - 1 చెంచా
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు అంత
పంచదార - 1 చెంచా
ఉప్పు - రుచికి తగినంత
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.!
గోవా స్టైల్ చికెన్ మసాలా తయారీ విధానం
-ముందుగా మసాలా పేస్ట్ కోసం.. అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, చింతపండు, పంచదార ఒక మిక్సీ జార్ లో తీసుకోండి. కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని నూనె వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి.
- తర్వాత అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న గోవా స్పెషల్ మసాలా పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయి, నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై దోరగా వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రటి టమాటా ముక్కలను వేసి, అవి మెత్తగా గుజ్జులా మారి మసాలాతో కలిసే వరకు మగ్గనివ్వండి. తర్వాత చికెన్ ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపండి.
-ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా ఓ 5 నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత ఒక అరకప్పు నీళ్లు పోసి, మూత పెట్టి మీడియం మంటపై సుమారు 15 నిమిషాల పాటు చికెన్ ను మెత్తగా ఉడికించండి.
-చికెన్ ముక్కలు చక్కగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత, చివరగా రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి ఓసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వెనిగర్ వంటకానికి ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన కిక్ ఇస్తుంది.
-అంతే నోరూరించే గోవా స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications