Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
కూరల్లో పెరుగు వేసేటప్పుడు ఇలా చేస్తే అస్సలు విరిగిపోదు..సెలబ్రిటీ చెఫ్ టిప్స్!
భారతీయ వంటకాల రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మన గ్రేవీ కూరల గురించి ఎంత చెప్పినా తక్కువే. షాహీ పనీర్, కధి, దమ్ ఆలూ వంటి వంటకాలను తలుచుకుంటేనే నోటిలో నీళ్లు ఊరుతాయి. ఇలాంటి వంటకాల రుచిని, ఆకృతిని రెట్టింపు చేయడానికి మనం విరివిగా ఉపయోగించే పదార్థం పెరుగు. గ్రేవీలో కొద్దిగా పెరుగు కలపడం వల్ల దానికి కమ్మని క్రీమీ టెక్స్చర్ రావడమే కాకుండా, కాస్త పుల్లటి అద్భుతమైన రుచి తోడవుతుంది.

అయితే పెరుగుతో వంట చేసేటప్పుడు చాలామంది గృహిణులు, వంట ప్రియులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏమిటంటే.. వేడి వేడి గ్రేవీలో పెరుగు వేయగానే అది ఒక్కోసారి విరిగిపోయి, ముక్కలు ముక్కలుగా తేలుతుంది. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన వంటకం ఆఖరి నిమిషంలో ఇలా విరిగిపోయిన పెరుగు వల్ల చూడటానికి అసహ్యంగా తయారవుతుంది. రుచి కూడా పూర్తిగా మారిపోతుంది.
అసలు పెరుగు ఇలా ఎందుకు విరిగిపోతుంది? దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతల్లోని తీవ్రమైన మార్పులు,పెరుగును గ్రేవీలో కలిపే విధానంలో చేసే తప్పులే. ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ పంకజ్ భదౌరియా వంటగదిలో మనం ఎదుర్కొనే ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. గ్రేవీలో పెరుగు అస్సలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆమె రెండు అద్భుతమైన చిట్కాలను చెప్పారు. అవేంటో ఇక్కడ చూడండి.
గది ఉష్ణోగ్రతకు తీసుకురావడం
చాలామంది చేసే పొరపాటు ఫ్రిజ్ నుంచి పెరుగును తీయగానే నేరుగా దానిని
వేడి గ్రేవీలో వేసేయడం. ఇలా అస్సలు చేయకూడదు. చెఫ్ పంకజ్ సూచన
ప్రకారం..మీరు వంటకు ఉపయోగించే పెరుగును కనీసం 15 నిమిషాల ముందే
ఫ్రిజ్ నుంచి బయటకు తీసి పెట్టుకోవాలి. అప్పుడు అది చల్లదనం తగ్గి,
సాధారణ గది ఉష్ణోగ్రతకు (రూం టెంపరేచర్) చేరుకుంటుంది. ఇలా ఉష్ణోగ్రత
సమతుల్యంగా ఉన్న పెరుగును వాడటం వల్ల వేడికి అది విరిగిపోయే అవకాశం
చాలా వరకు తగ్గుతుంది.
మంట ఆర్పేసి, బాగా గిలకొట్టడం
రెండవ ముఖ్యమైన నియమం ఏమిటంటే.. పెరుగును గ్రేవీలో వేసే ముందు స్పూన్
లేదా విస్కర్ సహాయంతో ఉండలు లేకుండా మెత్తగా క్రీమ్ లాగా గిలకొట్టాలి.
ఆ తర్వాత, స్టవ్ మంటను పూర్తిగా ఆర్పేయండి. ఇప్పుడు గిలకొట్టిన
పెరుగును ఆ గ్రేవీలో వేసి, కనీసం ఒక్క నిమిషం పాటు ఆపకుండా గరిటెతో
వేగంగా కలుపుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల పెరుగు గ్రేవీలో చక్కగా
కలిసిపోయి, అద్భుతమైన ఆకృతిని ఇస్తుంది.

రుచితో పాటు ఆరోగ్య నిధి..
పెరుగు కేవలం వంటకాల రుచిని పెంచడమే కాదు, మన ఆరోగ్యానికి ఒక సంజీవని
లాంటిది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, పొటాషియంతో పాటు
ప్రోబయోటిక్స్ అనబడే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన
ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో
మంట, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేయడంలో పెరుగు అద్భుతంగా
పనిచేస్తుంది.
రోజూ మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి, శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. అంతేకాదు, చర్మం నిగనిగలాడేలా చేయడంలో, జుట్టు రాలడాన్ని అరికట్టడంలో కూడా పెరుగులోని పోషకాలు సహాయపడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడి, తక్షణ శక్తిని ఇవ్వడంలో పెరుగుకు సాటి మరొకటి లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
