Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్!
డైట్ చేస్తున్నా, ఆరోగ్య సమస్యలున్నా.. ముందుగా మనం వదులుకోవాల్సింది నూనెలో వేయించిన పదార్థాలనే. కానీ, వాటిని చూసినప్పుడు నోరు కట్టేసుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా సాయంత్రం వేళ టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకునే సమయంలో లేదా మధ్యాహ్నం భోజనంలో పప్పు, సాంబారుతో పాటు కరకరలాడే పాపడ్, వడియాలు లేదా చిప్స్ నములుతుంటే ఆ మజాయే వేరు.

అయితే, వాటిని వేయించడానికి వాడే నూనెను తలుచుకుంటేనే సగం భయమేస్తుంది. ఈ నూనె వల్ల బరువు పెరుగుతామేమో, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ వస్తుందేమో అన్న బెంగతో చాలామంది తమ మనసుకు నచ్చిన స్నాక్స్ కు, ఈ కరకరలాడే ఆనందానికి దూరమవుతుంటారు.
అయితే, మీ భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే నోటికి రుచిని అందించే అద్భుతమైన ట్రిక్ ఒకటి ఉంది. ఒక్క చుక్క నూనె కూడా లేకుండా, అచ్చం షాపుల్లో దొరికేలా పాపడ్ లను, చిప్స్ ను కరకరలాడేలా వేయించుకునే ఈ ఇంట్లో చేసుకునే చిట్కా అందరినీ ఆకర్షిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నూటికి నూరు పాళ్లు నిజం. సెలబ్రిటీ చెఫ్ పంకజ్ భదూరియా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఆయిల్ ఫ్రీ ఫ్రైయింగ్ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోను తన అకౌంట్ లో షేర్ చేస్తూ చెఫ్ పంకజ్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. చిప్స్, పాపడ్స్ అంటే ప్రాణం.. కానీ వాటిలో ఉండే నూనెను చూస్తేనే భయం.. ఇలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన హోమ్ హాక్. ఇకపై నూనె భయం లేకుండా చిప్స్ వేయించుకుని లాగించేయొచ్చు అని ఆమె తెలిపారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందంటే..
ముందుగా చెఫ్ పంకజ్ ఒక టేబుల్ మీద రకరకాల పాపడ్ లు, కలర్ వడియాలు, పాప్ కార్న్ లాంటి స్నాక్స్ అన్నింటినీ అందంగా గాజు గిన్నెలలో అమర్చి చూపించారు. సాధారణంగా వీటన్నింటినీ డీప్ ఫ్రై చేయడానికి కడాయి నిండా నూనె పోస్తాం. కానీ, ఆమె అందుకు పూర్తి భిన్నమైన, అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతిని ఎంచుకున్నారు. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి పాన్ పెట్టారు. అందులో నూనెకు బదులుగా కొద్దిగా ఉప్పు పోశారు. గ్యాస్ ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఉప్పును గరిటెతో తిప్పుతూ బాగా వేడిచేశారు.
ఉప్పు పూర్తిగా వేడెక్కిన తర్వాత.. అందులో ఒక్కొక్కటిగా వడియాలు వేయడం మొదలుపెట్టారు. ఉప్పు వేడికి అవి అచ్చం నూనెలో వేయించినట్లే లావుగా ఉబ్బడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఒక సాధారణ మినప పాపడ్ ను, అలాగే బంగాళదుంప పాపడ్ ను కూడా ఆ వేడి ఉప్పులోనే అటూ ఇటూ తిప్పుతూ వేయించారు. ఆశ్చర్యకరంగా అవి ఎక్కడా మాడిపోకుండా, నూనెలో వేయించిన వాటికంటే మరింత కరకరలాడుతూ, చూడముచ్చటగా ఫ్రై అయ్యాయి. వేయించిన తర్వాత వాటికి అంటుకున్న ఉప్పును సులభంగా దులిపేయవచ్చు.
ఈ పద్ధతి మనకు వీధుల్లో వేరుశెనగలు, పేలాలు వేయించే వారిని గుర్తుచేస్తుంది. ఇన్నాళ్లూ ఈ ట్రిక్ తెలియక అనారోగ్యం పాలయ్యాం అని కొందరు, ఇది డైట్ చేసేవారికి నిజంగా ఒక వరం అని మరికొందరు ఈ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications