పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం.!

పాయసం అంటే చాలు ఎవరైనా సరే గ్లాసులు పట్టుకుని ముందుకు వచ్చేస్తారు. ఇంకొంచెం అంటూ లొట్టలేసుకుంటూ తాగేస్తారు. ఇక భోజనం తర్వాత అయితే కడుపు నిండుగా ఉన్నా పాయసానికి పక్కా ప్లేస్‌ ఉంటుంది. అయితే పాయసం అంటే ఎప్పుడూ సేమియా, బియ్యంతోనే తెలుసు. కానీ చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా.? పోషకాలు సమృద్ధిగా నిండిన తాజా పండ్లతో చేసుకునే ఈ పాయసాన్ని వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిందే. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్‌ వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం..

Chettinad fruit payasam for dessert and sweet after lunch know the easy process

చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు

జీడిపప్పు పలుకులు- 15
పిస్తా పప్పులు- 20
బియ్యం- రెండు టేబుల్‌ స్పూన్లు
ఏలకులు- 8
పాలు- లీటర్‌
కండెన్స్‌డ్‌ మిల్క్- 200 గ్రాములు (లేదా చక్కెర, పటిక బెల్లం.. స్వీట్‌నెస్‌కి తగినట్లుగా)
ఆపిల్‌ ముక్కలు- కప్పు
గ్రీన్‌ ద్రాక్ష- కప్పు
గింజలు తీసిన ఖర్జూరాలు- కప్పు
నల్ల ద్రాక్ష పండ్లు- కప్పు
దానిమ్మ గింజలు- కప్పు

చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం తయారీ విధానం

చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం తయారీ కోసం ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో జీడిపప్పు, పిస్తా పలుపులు వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

Chettinad fruit payasam for dessert and sweet after lunch know the easy process

ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని బియ్యం, ఏలకులు వేసి 30 నిమిషాల పాటు నాననివ్వాలి.

అరగంట తర్వాత ఈ రెండింటినీ వేర్వేరుగా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. కొన్ని నీళ్లు కలుపుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.

బ్యూటీ సీక్రెట్‌.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.!

ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని లీటర్‌ పాలు పోసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత చిన్న మంట పైన కాసేపు మరగనివ్వాలి.

పాలు మరుగుతున్నప్పుడు ముందుగా బియ్యం, ఏలకుల పేస్ట్‌ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత జీడిపప్పు, పిస్తా పలుకుల పేస్ట్‌ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

తర్వాత పాలలో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలపాలి. ఒకవేళ ఇది మీ కిచెన్‌లో అందుబాటులో లేకపోతే చక్కెర వేసుకోవచ్చు. చక్కెర తినని వారు పటిక బెల్లం అయినా మీకు కావాల్సిన తీపి మేరకు కలుపుకోవచ్చు.

ఈ మిశ్రమం మొత్తాన్ని 15 నిమిషాల పాటు చిన్న మంటపైన ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.

సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.!

తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపు యాపిల్‌, గ్రీన్‌ ద్రాక్ష, నల్ల ద్రాక్షను గింజలు లేకుండా చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఖర్జూరలో గింజలు తీసివేయాలి, దానిమ్మ గింజలు ఒలిచి పెట్టుకోవాలి.

పాయసం చల్లారిన తర్వాత ఈ పండ్ల ముక్కలను పాయసంలో వేసి కలుపుకోవాలి. అంతే చాలా ఈజీగా రుచికరమైన చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసం రెడీ.

చెట్టినాడ్‌ ఫ్రూట్‌ పాయసాన్ని ముఖ్యంగా వర్షాకాలంలో తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేస్తుంది. పండ్లలో ఫైబర్‌ కారణంగా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది.

[ of 5 - Users]
Story first published: Monday, August 31, 2026, 11:25 [IST]
Desktop Bottom Promotion