Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు!
దక్షిణ భారతీయుల ఉదయం ఇడ్లీ, దోశలతోనే ఎక్కువగా మొదలవుతుంది. అయితే ఆ టిఫిన్స్ ఎంత మెత్తగా, రుచిగా ఉన్నా.. వాటికి సరైన చట్నీ జతపడితేనే అసలైన మజా వస్తుంది. ఎప్పుడూ తినే రొటీన్ పల్లీ, కొబ్బరి చట్నీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి కాస్త ఘాటుగా, పుల్లగా, తియ్యగా.. అన్ని రుచుల మేళవింపుతో ఉండే అదిరిపోయే చెట్టినాడ్ ఎండుమిరప చట్నీ ట్రై చేయండి.
చెట్టినాడ్ వంటకాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వాటిలోని అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకమైన కారం. ఈ చట్నీ కూడా అంతే.. ఒక్కసారి రుచి చూశారంటే దీనికి మీరు పూర్తిగా ఫిదా అయిపోతారు. మళ్లీ మళ్లీ ఇదే కావాలని ఇంట్లో వాళ్లు అడిగి మరీ చేయించుకుంటారు. ఇది చాలా సులభంగా, తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు.

చెట్టినాడ్ ఎండుమిరప చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - తగినంత
వెల్లుల్లి రెబ్బలు - 3
చిన్న ఉల్లిపాయలు - 5
ఎండుమిర్చి - 10
కరివేపాకు - కొద్దిగా
చింతపండు గుజ్జు - కొద్దిగా
ఆవాలు - అర టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
బెల్లం - కొద్దిగా
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్!
చెట్టినాడ్ ఎండుమిరప చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, అందులో ఒక టీస్పూన్ నూనె వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కాక అందులో 3 వెల్లుల్లి రెబ్బలు, 5 చిన్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత, అందులో 10 ఎండుమిర్చి వేసి కలుపుతూ వేయించండి. ఎండుమిర్చి మాడకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు గుజ్జును వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు జతచేసి బరకగా (కోర్స్ పేస్ట్ లాగా) రుబ్బుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కాస్త బరకగా ఉంటేనే ఈ చట్నీకి అసలైన రుచి వస్తుంది.
-ఇప్పుడు మళ్లీ అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆవాలు వేగాక కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీ మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసి బాగా కలపండి.
-ఈ చట్నీని నూనె పైకి తేలే వరకు సన్నని మంట మీద బాగా మగ్గనివ్వాలి. అప్పుడే పచ్చడిలోని పచ్చిదనం పోయి రుచి అద్భుతంగా వస్తుంది. నూనె వేరు పడుతున్న సమయంలో సుమారు 1 టీస్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి కారం, చింతపండు పులుపును బ్యాలెన్స్ చేయడానికి చివరగా కొద్దిగా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పచ్చడి రుచిని రెట్టింపు చేస్తుంది.
-అంతే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ ఎండుమిరప చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
