Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి

Posted By:

వీకెండ్ వచ్చినా, ఇంట్లో ఏదైనా స్పెషల్ పార్టీ ఉన్నా.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది నాన్ వెజ్ వంటకాలే. అందులోనూ ఎప్పుడూ తినే రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా కాస్త కొత్తగా, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తే..చికెన్ కోఫ్తా కర్రీ పర్ఫెక్ట్ ఛాయిస్.

ఎంతో మృదువుగా ఉండే చికెన్ బాల్స్, క్రీమీగా ఉండే రిచ్ గ్రేవీ కలయిక మీ భోజనానికి మరింత స్పెషల్ టచ్ ఇస్తుంది. చికెన్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Chicken Kofta Curry Recipe How to Make Restaurant Style Chicken Kofta at Home in Telugu

చికెన్ కోఫ్తా తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌ లెస్ చికెన్ (కీమాలా చేసుకున్నది) - 250 గ్రాములు
కారం - అర టీస్పూన్
చికెన్ మసాలా పౌడర్ - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా పౌడర్ - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
రిచ్ గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు
బాదం పప్పులు - 5
జీడిపప్పు - 7
పుచ్చ గింజలు - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో - 1
వేయించిన ఉల్లిపాయలు (ఫ్రైడ్ ఆనియన్స్) - 2
పెరుగు - పావు కప్పు
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా పౌడర్ - అర టీస్పూన్
చికెన్ మసాలా పౌడర్ - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు (యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క) - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా

కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు!

చికెన్ కోఫ్తా కర్రీ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో చికెన్ కీమాను తీసుకోండి. అందులో కారం, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. మసాలాలు చికెన్‌కు బాగా పట్టిన తర్వాత, చిన్న చిన్న బాల్స్ (కోఫ్తాలు) లాగా చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసి, మంటను మీడియంలో ఉంచి రెడీ చేసుకున్న కోఫ్తాలను 5 నుండి 7 నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఒక మిక్సీ జార్ తీసుకొని.. అందులో బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు, టొమాటో ముక్కలు, వేయించిన ఉల్లిపాయలు, పెరుగు వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రిచ్ పేస్ట్ వల్లే కర్రీకి అద్భుతమైన రుచి వస్తుంది.

-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో మసాలా దినుసులు వేసి వేయించాక, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ ను సుమారు 5 నిమిషాల పాటు నూనెలో బాగా ఉడికించాలి.

-గ్రేవీ పచ్చివాసన పోయాక.. అందులో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి కలపాలి. నూనె పైకి తేలుతున్న సమయంలో.. ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కోఫ్తాలను ఇందులో వేయాలి. కోఫ్తాలకు గ్రేవీ పట్టేలా నిదానంగా కలిపి, మూత పెట్టి మంటను సిమ్‌ లో ఉంచి మరో 7 నిమిషాలు ఉడికించాలి.

-చివరగా అందులో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే..స్పైసీ, జ్యూసీ చికెన్ కోఫ్తా కర్రీ రెడీ. వేడి వేడి నాన్, బటర్ రోటీ, బగారా రైస్ లేదా చపాతీతో ఈ కర్రీని తింటే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, October 3, 2026, 7:13 [IST]
Desktop Bottom Promotion