Latest Updates
-
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!
ఈ పద్దతిలో చికెన్ ఆమ్లెట్ చేసుకుంటే..జన్మలో మర్చిపోలేని రుచి,ఇదిగో రెసిపి
ఎప్పుడూ ఒకే రకమైన ఆమ్లెట్ తిని తిని బోర్ట్ కోట్టేసిందా? కొత్త స్టైల్ లో ఆమ్లెట్ తినాలపిస్తుందా? అయితే ఓ సారి చికెన్ ఆమ్లెట్ ట్రై చేయండి. గుడ్డు ప్రొటీన్లకు నిలయం,అదేవిధంగా చికెన్ లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కలిపి ఆమ్లెట్ వేస్తే రుచి మామూలుగా ఉండదు. చికెన్ ఆమ్లెట్ ని ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు. చికెన్ ఆమ్లెట్ ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. చికెన్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
చికెన్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ లెస్ చికెన్
-ఆయిల్
-కోడి గుడ్డు
-ఉల్లిపాయ
-కారం
-పసుపు
-ఉప్పు
-మిరియాల పొడి
-కొత్తిమీర

చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం
-ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బోన్ లెన్ చికెన్ ని ఓ బౌల్ లో వేసి
అందులో కొంచెం కారం,పసుపు,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ మీ పాన్ పెట్టి అందులో ఈ చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి పావుగంట సేపు ఉడికించుకోవాలి.
-చికెన్ ముక్కల్లో నుంచి నీరు వచ్చేంతవరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను చల్లారనివ్వాలి.
-తర్వాత చికెన్ ముక్కలను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు మరో బౌల్ లో కోడిగుడ్లు కొట్టి ఇందులోనే కొంచెం కారం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు,చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, బాయిల్ చేసిన చికెన్ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి.
-తర్వాత దానిమీద బౌల్ లో కలిపి ఉంచిన కోడిగుడ్ల మిశ్రమాన్ని పోయండి.
-కొంచెం కొత్తిమీర కూడా దానిమీద చల్లుకొని మూతపెట్టేయండి.
-ఆమ్లెట్ ఒకవైపు బాగా కాలిన తర్వాత తిరగతిప్పి రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి.
-రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దానిని ఓ ప్లేట్ లోకి తీసుకుంటే చికెన్ ఆమ్లెట్ తినడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
