Latest Updates
-
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి -
చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? -
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
వేడి వేడి అన్నం, పప్పులోకైనా.. లేదా సాయంత్రం వేళ టీ తాగుతున్నప్పుడైనా కరకరలాడే పాపడాలు ఉంటే ఆ మజాయే వేరు కదూ. భోజనం రుచిని రెట్టింపు చేయడంలో వీటికి సాటి మరొకటి లేదు. కానీ మనకు మార్కెట్లో దొరికే రెడీమేడ్ పాపడాలు మన ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆకర్షణీయమైన రంగుల కోసం వాడే రసాయనాలు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, నాసిరకమైన నూనె.. ఇవన్నీ మన ఆరోగ్యానికి హాని చేస్తాయి.
అత్యంత తక్కువ ఖర్చుతో, ఎంతో శుచిగా మన ఇంట్లోనే బంగాళదుంప పాపడ్(ఆలూ పాపడ్) తయారు చేసుకోవచ్చు. ఇవి స్వచ్ఛమైన తెలుపు రంగులో, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత కరకరలాడుతూ ఉంటాయి. రుచికరమైన బంగాళదుం పాపడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
లేత తెల్లని బంగాళాదుంపలు: 1 కిలో
ఉప్పు: 1 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా: అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
నూనె: 1 టేబుల్ స్పూన్
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, మెత్తగా ఉడికించుకోవాలి. అవి చల్లారిన తర్వాత తొక్క తీసేయాలి. ఇప్పుడు ఆ బంగాళదుంపలను ఎక్కడా చిన్న చిన్న ముక్కలు లేదా ఉండలు లేకుండా మెత్తగా తురుముకోవాలి.
-మెత్తగా తురుముకున్న బంగాళాదుంపల మిశ్రమంలో ఉప్పు, జీలకర్ర, దంచిన ఎండు మిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. కొద్దిగా నూనెను చేతులకు రాసుకుని, ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు కలుపుకున్న పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి. ఒక మందపాటి పాలిథీన్ కవర్ తీసుకుని దానికి కాస్త నూనె రాయాలి. ఒక ఉండను కవర్ మధ్యలో పెట్టి, కవర్ను మడిచి.. పైనుంచి ఏదైనా బరువైన పల్లెం లేదా చపాతీ కర్రతో గుండ్రంగా, పలచగా ఒత్తాలి.
-ఇలా ఒత్తుకున్న పాపడాలను ఒక శుభ్రమైన వస్త్రం లేదా కవర్ పై ఎండలో ఆరబెట్టాలి. మంచి ఎండ ఉంటే ఒక్క రోజులోనే ఇవి చక్కగా ఎండిపోతాయి.
-బాగా ఎండిన పాపడాలను ఒక గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే, ఏకంగా ఏడాది పాటు నిల్వ ఉంటాయి. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడి వేడి నూనెలో వేయించుకుని ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
