Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.!
మొక్కజొన్న అంటే నిప్పులపై కాల్చుకుని తినడమే కాదు.. పాప్ కార్న్, స్వీట్ కార్న్, వడలు ఇలా ఎన్నో రకాల వెరైటీలు ఫేమస్, అయితే ఎప్పుడైనా వీటితో పకోడీ ట్రై చేశారా.? మిక్సీ పట్టే పని లేకుండా నోటికి కరకరలాడుతూ స్పైసీగా ఉండే కార్న్ పకోడీని ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఒక్కటి కూడా వదలకుండా తింటారు.. ముఖ్యంగా ఇందులో కలిపే ఒక పౌడర్ వెరీ స్పెషల్. దీంతోనే ఈ పకోడీలకు అమోఘమైన రుచి వస్తుంది. క్రిస్పీ కార్న్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం..

కార్న్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు..
కార్న్- రెండు
కరివేపాకు- మూడు రెబ్బలు
కొత్తిమీర- గుప్పెడు
చిల్లీ ఫ్లేక్స్- టీస్పూన్
కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్- అర
టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
ఎండిన మామిడి పౌడర్- టీస్పూన్
జీలకర్ర పొడి- పావు టీస్పూన్
కార్న్ ఫ్లోర్- రెండు టేబుల్
స్పూన్లు
శనగపిండి- కప్పు
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
కార్న్ పకోడీ తయారీ విధానం
ముందుగా మొక్కజొన్నను గింజలుగా కట్ చేసి ఒక వెడల్పాటి బౌల్‌లో వేసుకోవాలి.
ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్‌ను కలపాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత డ్రై మ్యాంగో పౌడర్‌ను వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, కార్న్ ఫ్లోర్, శనగపిండి వేసుకోవాలి.
ఈ మొత్తాన్ని కలగలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలిపి గట్టిగా పిండి ముద్దలా కలుపుకోవాలి. జారుగా ఉండకూడదు. లేదంటే పకోడీలో సరిగా రావు.

ఓ పదినిమిషాల పాటు కార్న్ స్టఫ్‌ను నాననివ్వాలి, దీనిద్వారా అందులోకి మసాలాలు బాగా పడతాయి.
ఇప్పుడు స్టవ్‌పైన బాణలి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక పిండి ముద్దను పకోడీల్లా చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి.
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి!
వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి. క్రిస్పీగా కాలిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దీనిని టమాటా సాస్ లేదా పల్లీ, అల్లం చట్నీతో తింటే ఆ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.
పిల్లలు పెద్దలూ నచ్చేలా బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ ఇది. ఈ సాయంత్రం తప్పనిసరిగా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
