Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి!
సాయంత్రం అవ్వగానే వేడి వేడి టీతో పాటు కరకరలాడే స్నాక్ ఏదైనా తినాలనిపించడం సహజం. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే రోజూ చేసుకునే పకోడీలు, బజ్జీలు, శాండ్ విచ్ లకు బదులుగా ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే..క్రిస్పీ మునగకాయ స్నాక్ మీకు బెస్ట్ ఛాయిస్.
సాధారణంగా మునగకాయ అనగానే మనకు సాంబార్ లేదా కూర మాత్రమే గుర్తొస్తాయి. కానీ, సరైన మసాలాలు దట్టించి ఇలా స్నాక్ లా చేస్తే దాని రుచి అమోఘంగా ఉంటుంది.

మునగకాయ స్నాక్ తయారీకి కావలసిన పదార్థాలు
మునగకాయలు - 2
శనగపప్పు - 50 గ్రాములు
పచ్చి బియ్యం - అర కప్పు
పచ్చిమిర్చి - 2
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఆమ్చూర్ పొడి - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి (సుమారు 4 టేబుల్ స్పూన్లు)
కొత్తిమీర - కొద్దిగా
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి
మునగకాయ స్నాక్ తయారీ విధానం
-ముందుగా మునగకాయలను శుభ్రంగా కడిగి, సుమారు 2 అంగుళాల పొడవుండేలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని ఈ ముక్కలను వేసి ఉడికించాలి. ముక్కలు మరీ మెత్తబడిపోయి ఆకారం కోల్పోకుండా, సగం ఉడికేలా చూసుకోవాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి ముక్కలను పక్కన పెట్టుకోండి.
-ఈ స్నాక్ కు అసలైన రుచినిచ్చేది పైన వేసే కోటింగే. దీనికోసం శనగపప్పు, బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీటిని వంపేసి, మిక్సీ జార్ లో నానబెట్టిన పప్పు, బియ్యంతో పాటు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, తగినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పిండి మరీ నీళ్లలా పల్చగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి. ఉడకబెట్టిన మునగకాయ ముక్కలను తీసుకుని, రుబ్బి పెట్టుకున్న మసాలా పిండిలో బాగా ముంచండి. పిండి ముక్కకు అన్ని వైపులా దట్టంగా పట్టేలా చూసుకుని కాగుతున్న నూనెలో వేయండి.
-మంటను మీడియంలో ఉంచి, ముక్కలు లేత బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు అటూ ఇటూ తిప్పుతూ వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోండి. అంతే మునగకాయ స్నాక్ రెడీ.
-పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని, గ్రీన్ చట్నీ లేదా టొమాటో కెచప్ తో వేడివేడి టీతో కలిపి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
