Latest Updates
-
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
మనలో చాలా మందికి పరాటాలు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ పొరలు పొరలుగా, కరకరలాడుతూ ఉండే లచ్చా పరాటా కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తినేస్తాం. అయితే మీరు ఎప్పుడైనా సొరకాయ లచ్చా పరాటా సరుచి చూశారా? వినడానికి కాస్త కొత్తగా ఉన్నా, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
ప్రముఖ చెఫ్ భరత్ వాధ్వా తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ సరికొత్త రెసిపీని పంచుకున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయతో అదిరిపోయే రుచితో దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

సొరకాయ లచ్చా పరాటా తయారీకి కావలసిన పదార్థాలు
పిండి కలుపుకోవడానికి
మైదా లేదా గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
వాము - అర టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
నెయ్యి, నీళ్లు - తగినంత
మసాలా స్టఫింగ్ కోసం
లేత సొరకాయ - 1
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 6
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
వాము - అర టీస్పూన్
ఆమ్ చూర్ పొడి - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
అల్లం - 1 అంగుళం ముక్క
కొత్తిమీర తరుగు - కొద్దిగా
పచ్చి ఆవ నూనె - 1 టేబుల్ స్పూన్
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!
సొరకాయ లచ్చా పరాటా తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ తురుముకు కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టండి. కాసేపటి తర్వాత ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంలో ఈ తురుమును వేసి, అందులోని నీరంతా పోయేలా గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, వాము, కసూరి మేతి వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. ఈ పిండిపై కొద్దిగా నెయ్యి రాసి, మూతపెట్టి 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు మసాలా స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా నీళ్లు పిండేసిన సొరకాయ తురుములో.. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వాము, ఉప్పు, ఆమ్ చూర్ పొడి, అల్లం తురుము, కొత్తిమీర తరుగు వేయాలి. వీటికి అదనపు రుచినిచ్చేందుకు పచ్చి ఆవ నూనె, శనగపిండి కూడా జతచేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-నానబెట్టిన పిండిని తీసుకుని చపాతీలా కాస్త పెద్దగా ఒత్తుకోవాలి. దానిపై నెయ్యి రాసి, మనం సిద్ధం చేసుకున్న సొరకాయ మసాలాను అంతటా సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా రోల్ చేస్తూ మడిచి, మధ్యలోకి కట్ చేయాలి. ఆ తర్వాత పొరలు వచ్చేలా (లచ్చా పరాటా ఆకారంలో) చుట్టి, మళ్లీ సున్నితంగా చపాతీలా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద పెనం వేడి చేసి, పరాటాను వేయాలి. మంటను మీడియంలో ఉంచి, రెండు వైపులా నెయ్యి రాస్తూ కాల్చుకోవాలి. లోపల ఉన్న మసాలా కూడా బాగా ఉడికేలా గరిటెతో అంచుల వెంబడి నెమ్మదిగా నొక్కుతూ దోరగా వేయించుకోవాలి.
-అంతే.. వేడివేడిగా, పొరలు పొరలుగా ఉండే నోరూరించే సొరకాయ లచ్చా పరాటా రెడీ. దీన్ని చల్లటి పెరుగుతో గానీ, ఏదైనా ఊరగాయతో గానీ తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
