టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా..

Posted By:

సాయంత్రం వేళ చల్లటి గాలి, చేతిలో వేడివేడి టీ కప్పు.. దీనికి తోడు కరకరలాడే, కారంగా ఉండే ఏదైనా స్నాక్ ఉంటే ఆ ఆనందమే వేరు. సాధారణంగా సాయంత్రం ఆకలి వేయగానే మనకు సమోసాలు, లేదా వేడివేడి పకోడీలు గుర్తుకువస్తాయి. కానీ నూనెలో డీప్ ఫ్రై చేసిన ఈ పదార్థాలు రుచిగా ఉన్నప్పటికీ, మన ఆరోగ్యానికి మాత్రం ఏమాత్రం మంచివి కావు.

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్ మఖానా టిక్కీ. పోషకాల గని అయిన మఖానా (తామర గింజలు), ఉడికించిన బంగాళాదుంపలు, సువాసనభరితమైన మసాలాలతో కలిపి చేసే ఈ టిక్కీ బయట ఎంతో కరకరలాడుతూ, లోపల వెన్నలా మెత్తగా ఉంటుంది. తక్కువ నూనెతో ఎంతో సులభంగా మఖానా టిక్కీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Crispy Makhana Tikki Recipe in Telugu Healthy Evening Snack for Tea Time

కావలసిన పదార్థాలు

మఖానా (తామర గింజలు): 2 కప్పులు
బంగాళాదుంపలు: 2
వేరుశెనగ పొడి: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 1 నుండి 2
తురిమిన అల్లం: 1 టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి: 1 టీస్పూన్
చాట్ మసాలా: 1 టీస్పూన్
ఎర్ర కారం పొడి: అర టీస్పూన్
ఆమ్చూర్ పొడి లేదా నిమ్మరసం: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె: 3 టేబుల్ స్పూన్లు

ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు

తయారీ విధానం

-ముందుగా ఒక పాన్ లేదా బాండీ తీసుకుని, అందులో నూనె లేకుండా లేదా కేవలం అర టీస్పూన్ నెయ్యి వేసి మఖానాను తక్కువ మంట మీద 4 నుండి 5 నిమిషాలు దోరగా వేయించండి. ఇవి బాగా కరకరలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా ముతకగా లేదా మెత్తని పొడిలా రుబ్బుకోండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మెదిపిన బంగాళాదుంపలు, రుబ్బిన మఖానా పొడి, వేరుశెనగ పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు,ఇతర పొడి మసాలాలన్నీ వేయండి. అన్నీ బాగా కలిసి ఒక ముద్దలా అయ్యేంత వరకు కలపండి. ఒకవేళ పిండి మరీ పొడిగా అనిపిస్తే, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీరు గానీ, పెరుగు గానీ చేర్చి కలపండి.

-చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, ఈ మిశ్రమం నుండి చిన్న చిన్న ఉండలు తీసుకోండి. వాటిని అరచేతుల మధ్య ఉంచి మెల్లగా నొక్కి, గుండ్రని టిక్కీల ఆకారంలోకి తీసుకురండి.

-స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ లేదా తవా పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. సిద్ధం చేసుకున్న టిక్కీలను తక్కువ నుండి మీడియం మంట మీద పెట్టి, రెండు వైపులా చక్కటి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడే వరకు కాల్చుకోండి.

-అంతే నోరూరించే వేడివేడి మఖానా టిక్కీలు రెడీ. వీటిని పుదీనా-కొత్తిమీర పచ్చని చట్నీతో లేదా పుల్లని-తీపి చింతపండు చట్నీతో ఆస్వాదిస్తే సూపర్ గా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 24, 2026, 17:08 [IST]
Desktop Bottom Promotion