Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఈ స్పెషల్ బెండకాయ రోస్ట్ ముందు నాన్ వెజ్ ఫ్రైలు కూడా పనికిరావు..ట్రై చేసి చూడండి!
బెండకాయ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. అయితే బెండకాయ కూర చేసేటప్పుడు వచ్చే జిగురు వల్ల కొంతమంది దీనికి కాస్త దూరంగా ఉంటారు. కానీ ఒక్కసారి ఈ స్పెషల్ బెండకాయ రోస్ట్ చేసి చూడండి.. దీని అద్భుతమైన రుచికి మీరు ఫిదా అవ్వడం ఖాయం. పెరుగుతో మ్యారినేట్ చేసి, నూనెలో వేయించే ఈ కరకరలాడే బెండకాయ రోస్ట్.. పప్పు, సాంబార్ లేదా రసంలోకి అద్భుతమైన సైడ్ డిష్ గా ఉంటుంది.

బెండకాయ రోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు
లేత బెండకాయలు - 250 గ్రాములు
పసుపు - పావు టీస్పూన్
కాశ్మీరీ కారం - ఒకటిన్నర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె లేదా మీకు నచ్చిన వంట నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఇంగువ- చిటికెడు
బెండకాయ రోస్ట్ తయారీ విధానం
-ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తడి లేకుండా తుడిచి, ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి.
-ఇప్పుడు ఆ గిన్నెలో పసుపు, కాశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేయండి. బెండకాయ ముక్కలన్నింటికీ ఈ మసాలా మిశ్రమం బాగా పట్టేలా చేత్తో సున్నితంగా కలపండి. ఈ మిశ్రమాన్ని కనీసం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు మసాలా పట్టి, వేయించినప్పుడు మంచి రుచి వస్తుంది.
-తర్వాత ఒక వెడల్పాటి పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి, అందులో నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించండి. ఆవాలు చిటపటలాడాక, చిటికెడు ఇంగువ వేసి బాగా కలపండి.
-ఇప్పుడు పాన్ లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి నెమ్మదిగా కలపండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించండి.
-మీకు బెండకాయలు కొద్దిగా మెత్తగా కావాలంటే 7 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. లేదు, మరింత కరకరలాడుతూ కావాలంటే మంటను సిమ్ లో ఉంచి మరో రెండు మూడు నిమిషాలు ఎక్కువ సేపు ఫ్రై చేసుకోండి.
-ఈ ఫ్రైలో పెరుగు వాడటం వల్ల బెండకాయలోని జిగురు పూర్తిగా పోవడమే కాకుండా, ముక్కలు లోపల మృదువుగా, పైన క్రిస్పీగా తయారవుతాయి. కాశ్మీరీ కారం కూరకు ఎర్రటి ఆకర్షణీయమైన రంగును ఇస్తుంది.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే బెండకాయ రోస్ట్ రెడీ. వేడి వేడి అన్నంలోకి రసం లేదా సాంబార్ కలుపుకుని, నంజుకోవడానికి ఈ బెండకాయ ఫ్రై పెట్టుకుని తింటే.. ఆ రుచికి ఎవరైనా లొట్టలేయాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
