Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
వంకాయతో చేసే కూరలు, పచ్చళ్లు లేదా వంకాయ భర్తా తిని మీకు బోర్ కొట్టిందా? ఏదైనా కొత్తగా, రుచికరంగా తినాలనిపిస్తోందా? అయితే వంకాయను ఇష్టపడే వారికి ఈ కరకరలాడే వంకాయ వేపుడు ఒక అద్భుతమైన రుచిని పరిచయం చేస్తుంది. బెంగాల్ లో బేగున్ భాజాగా పిలుచుకునే ఈ వంటకాన్ని అక్కడి ప్రజలు వేడి వేడి అన్నంతో ఎంతో ఇష్టంగా తింటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తయారు చేయడానికి మీకు డీప్ ఫ్రైకి సరిపడా నూనె కానీ, ఘాటైన గరం మసాలాలు కానీ అవసరం లేదు. కేవలం మన వంటగదిలో ఉండే అల్లం, వెల్లుల్లి, కొన్ని పొడి మసాలాలతోనే దీన్ని అద్భుతంగా తయారు చేయవచ్చు.
క్రిస్పీ వంకాయ ఫ్రై తయారీకి కావాల్సినవి
-వంకాయ
-కశ్మీరీ కారం
-ఉప్పు
-వెల్లుల్లి
-సోంపు
-పసుపు
-ఆమ్చూర్ పొడి
-అల్లం
-నిమ్మరసం
-నూనె

క్రిస్పీ వంకాయ ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఒక మీడియం సైజ్ లో ఉన్న వంకాయను తీసుకోండి. వంకాయను మరీ సన్నగా కాకుండా, కొంచెం మందంగా ఉండేలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక్కో వంకాయను మూడు లేదా నాలుగు పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. వేయించేటప్పుడు మనం పట్టించే మసాలా లోపలి వరకు వెళ్లి, ముక్కకు బాగా పట్టాలంటే, కత్తి లేదా ఫోర్క్ సహాయంతో వంకాయ ముక్కల పైన చిన్న చిన్న గాట్లు పెట్టండి. కోసిన వెంటనే వంకాయ ముక్కలు నల్లబడకుండా, వగరు రాకుండా ఉండటానికి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో నానబెట్టండి.
-ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీస్పూన్ కాశ్మీరీ కారం పొడి, 1 టీస్పూన్ సోంపు గింజలు, అర టీస్పూన్ పసుపు, మీ కారానికి తగినట్లుగా సాధారణ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఆమ్ చూర్ పొడి, రుచికి సరిపడా ఉప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
-నీటిలో నుండి వంకాయ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ను వంకాయ ముక్కలకు రెండు వైపులా దట్టంగా పట్టించండి. గాట్లలోకి మసాలా వెళ్లేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి కొద్దిగా ఆవనూనె వేడి చేయండి. ఆవనూనె ఈ వంటకానికి సాంప్రదాయ రుచిని ఇస్తుంది ఇష్టం లేనివారు సాధారణ వంట నూనె వాడొచ్చు.
-నూనె వేడెక్కాక వంకాయ ముక్కలను పాన్ లో ఉంచి, మంటను మీడియంలో పెట్టి రెండు వైపులా పైభాగం కరకరలాడేలా (క్రిస్పీగా) వేయించుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన క్రిస్పీ వంకాయ వేపుడు రెడీ. పళ్లెంలో వేడి వేడి అన్నం పెట్టుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ముక్కను కలుపుకుని తింటే ఆ రుచే వేరు. దీనిని పప్పు లేదా సాంబార్ తో నంజుకుని తింటే భోజనం అమృతంలా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
