వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్‌.!

సీజన్‌ ఏదైనా శరీరానికి చలువ అందించి, దీర్ఘకాలిక సమస్యలను కంట్రోల్‌ చేయడంలో ముందుండే అద్భుతమైన కూరగాయ కీరదోసకాయ. మెడిసిన్స్‌ తయారీలో కీలకంగా ఉపయోగించే కీరదోసను సలాడ్ రూపంలో ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ప్రతిసారీ దీనిని చప్పగా తినాలంటే కొంచెం ఇబ్బందే. అలాంటప్పుడు చాలా హెల్తీగా, ఎంతో టేస్టీగా, ఈజీగా ఇలా కీరదోసకాయ సలాడ్‌ను చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఫుల్‌ శాటిస్‌ఫైడ్‌గా ఉంటుంది.

Cucumber salad that helps lose weight quickly and control diabetes

కీరదోసకాయ సలాడ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

కీరదోసకాయ- నాలుగు
వేరుశనగ గుండ్లు- పావు కప్పు
నువ్వులు- రెండు టేబుల్ స్పూన్లు
నువ్వుల నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌- టీస్పూన్‌
దంచిన వెల్లుల్లి- టేబుల్‌ స్పూన్‌
లవంగాలు- మూడు
ఉప్పు- టీస్పూన్‌
తేనె- రెండు టేబుల్‌ స్పూన్లు

కీరదోసకాయ సలాడ్ తయారీ విధానం

ముందుగా కీరదోసకాయలను శుభ్రంగా కడగాలి. తొక్క తీయకూడదు. శుభ్రంగా తుడిచి రెండు భాగాలుగా కట్‌ చేసిన అనంతరం సన్నగా, పొడుగ్గా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని పల్లీలు వేసి వేయించాలి. తర్వాత వాటిని వేరే ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అనంతరం నువ్వులు వేసి చిటపటలాడేలా వేయించుకోవాలి. చల్లారిన పల్లీలను పొట్టు తీసేసి మిక్సీ జార్‌లో వేసి కోర్స్‌గా గ్రైండ్‌ చేసుకోవాలి.

Cucumber salad that helps lose weight quickly and control diabetes

ఇప్పుడు చిన్న పాన్‌లో నూనె వేసి కాగనివ్వాలి. ఆ లోపు చిన్న బౌల్‌లో రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్, దంచిన వెల్లుల్లి, లవంగాలు వేసి కలిపి కాగిన నువ్వుల నూనెను ఇందులో పోసుకోవాలి. తర్వాత స్పూన్‌తో కలపాలి.

ఇందులో ఉప్పు, తేనె వేసి మరోసారి స్మూత్‌గా కలపాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కట్‌చేసిన కీరదోస ముక్కల్లో వేసి గరిటెతో మొత్తం కలిసేలా కలపాలి. పై నుంచి పల్లీల పొడి, నువ్వులతో గార్నిష్‌ చేసుకోవాలి.

శరీర పనితీరుకు అద్భుతంగా దోహదపడే కీరదోసకాయ సలాడ్ రెడీ. కీరదోసకాయ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. బాడీ డీహైడ్రేషన్‌కి గురి కాకుండా కాపాడుతుంది. మెరుగైన జీర్ణక్రియను అందించడంతో పాటు చర్మ సంరక్షణకు సహకరిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, October 3, 2026, 6:40 [IST]
Desktop Bottom Promotion