Latest Updates
-
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?
చపాతీ,అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మటి పెరుగు-బెండకాయ కర్రీ చేసుకోండిలా..
బెండకాయతో ఎప్పుడూ ఒకే రకమైన ఫ్రై,పులుసు వెరైటీలు తిని బోర్ కొట్టిందా? అయితే పెరుగు బెండకాయ కర్రీ ట్రై చేయండి. పెరుగులోని కమ్మని పులుపు, వేయించిన బెండకాయలోని చిన్నపాటి కరకరలాడే గుణం కలిసి ఈ వంటకాన్ని అద్భుతంగా మారుస్తాయి. దీని తయారీ సులభం. రెస్టారెంట్ స్థాయిలో ఉండే పెరుగు బెండకాయ కర్రీని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
పెరుగు బెండకాయ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
తాజా బెండకాయలు - 400 గ్రాములు
ఉల్లిపాయ - 1
గడ్డ పెరుగు - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం పొడి - 1.5 టీస్పూన్
వంట నూనె - 5 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు బెండకాయ తయారీ విధానం
-ముందుగా బెండకాయలను నీటిలో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటిని సుమారు ఒక అంగుళం పొడవుండేలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక కట్ చేసిన బెండకాయ ముక్కలను అందులో వేయండి. మంటను మీడియంలో ఉంచి, బెండకాయలు జిగురు పోయి, లేత బంగారు గోధుమ రంగులోకి (క్రిస్పీగా) మారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-బెండకాయ వేగుతున్న సమయంలోనే, ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. పెరుగులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా,కారం పొడి వేసి, ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లో మిగిలిన నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేగగానే, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించండి. వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు ఎర్రగా బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత, మంటను తక్కువలో పెట్టి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు-మసాలా మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి. నూనె పైకి తేలే వరకు సుమారు 3-4 నిమిషాలు ఉడికించండి.
-పెరుగు మసాలా బాగా ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేయండి. గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలా కలిపి, చివరగా రుచికి సరిపడా ఉప్పు వేయండి. మూతపెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వండి.
-అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ పెరుగు బెండకాయ కర్రీ రెడీ. దీనిని వేడి వేడి చపాతీ, రోటీ, పరాటా లేదా అన్నంతో కలిపి తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications