నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్!

Posted By:

చికెన్ కారం పొడి లేదా చికెన్ పొడి అనేది నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన డిష్. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ చికెన్ కారం పొడి వేసుకుని తింటే దాని రుచే వేరు.దీనిని ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ ఐటమ్స్ తో తిన్నా అద్దిరిపోతుంది.

దీనిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే కొన్ని వారాల పాటు నిల్వ ఉంటుంది. సూపర్ టేస్టీ చికెన్ కారం పొడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Delicious Homemade Chicken Karam Podi How to Make Crispy Chicken Karam Podi Easily at Home In Telugu

చికెన్ కారం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు

-బోన్ లెస్ చికెన్
-ధనియాలు
-జీలకర్ర
-ఉప్పు
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగాలు
-మిరియాలు
-వెల్లుల్లి
-ఆయిల్
-కరివేపాకు
-ఎండుమిర్చి
-జీడిపప్పు
-ఉల్లిపాయ
-చింతపండు

చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు!

చికెన్ కారం పొడి తయారీ విధానం

-ముందుగా పావు కేజీ బోన్ లెస్ చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక నీళ్లు పోసి శుభ్రంగా కడగండి.

-కడిగిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకోండి. ఇందులోనే అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అరబద్ద నిమ్మరసం పిండుకొని మొత్తం అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో కలుపుకోండి. తర్వాత గిన్నెపై మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోండి.

-ఈలోపు కారంపొడికి కావాల్సినవన్నీ వేయించుకోవాలి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల జీలకర్ర, పావు టీస్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకలు వేసి తక్కువ మంట మీద మాడకుండా దోరగా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని అందులో అరకప్పు ఆయిల్ పోసి వేడి చెయ్యండి. ఆయిల్ వేడెక్కాక అందులో 10-15 ఎండుమిర్చి వేసుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే బాండీలో గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు బాండీలోని అదే ఆయిల్ లో 20-25 పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు అదే ఆయిల్ లో అరగంట సేపు పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించుకోండి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే ఆయిల్ లో పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల చీలికలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే ఆయిల్ లో 20 జీడిపప్పులు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి.

-వేయించినవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి.

-తర్వాత మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమంలోనే వేయించిన ఉల్లి, చికెన్ ముక్కలు, వెల్లుల్లి, జీడిపప్పు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవద్దు. 6-7 సార్లు పల్స్ ఇస్తూ కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇందులో వేయించిన కరివేపాకు వేసి చేత్తో కలుపుకోండి. అంతే చికెన్ కారం పొడి రెడీ.

-బాగా ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే బయట పెట్టుకున్నా కూడా నెల రోజులు నిల్వ ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, August 9, 2026, 9:01 [IST]
Desktop Bottom Promotion