Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పైకి కరకరలాడుతూ,లోపల జ్యూసీగా..తిన్నకొద్దీ తినాలనిపించే ఒడిషా స్పెషల్ ధాారాక్షి స్వీట్
భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు, వైవిధ్యభరితమైన ఆహారానికి పుట్టినిల్లు. ప్రతి రాష్ట్రానికి దాని ప్రత్యేకమైన వంటకాలు, రుచులు ఉంటాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రతి ఇంటా పిండివంటల సువాసనలు గుబాళిస్తాయి. అలాంటి అద్భుతమైన, సంప్రదాయబద్ధమైన రుచులను అందించడంలో ఒడిషా రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. రసగుల్లా వంటి ప్రసిద్ధ మిఠాయిలతో పాటు ఒడిషాలో అంతగా ప్రాచుర్యం పొందని రుచికరమైన స్వీట్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ధారాక్య. దీనిని ధారాక్షి అని కూడా పిలుస్తారు.
ఒడిషాలో ముఖ్యంగా దీపావళి, హోలీ వంటి పండుగలకు, శుభకార్యాలకు దీనిని తప్పకుండా తయారుచేసుకుంటారు. ఆంధ్రాలోని శ్రీకాకుళం,విజయనగరం వంటి ప్రాంతాల్లో కూడా దీనిని తయారుచేస్తారు. పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉంటుంది. ధారాక్షి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ధారాక్షి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-చక్కెర
-యాలకల పొడి
-ఆయిల్
-ఉప్పు
-మినపప్పు
-నిమ్మరసం
ధారాక్షి తయారీ విధానం
-ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు పొట్టుతో ఉండే పెసరపప్పు, పావుకప్పు పొట్టుతో ఉండే మినపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత చేత్తో గట్టిగా పిసుకుతూ పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడుగుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి లేదా బాండీ పెట్టి అందులో 2 కప్పుల చక్కెర, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మంటను మీడియంలో ఉంచి 5-6 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఎలాంటి తీగ పాకం రానక్కర్లేదు. జిడ్డుగా అయిన తర్వాత అందులో పావు టీస్పూన్ యాలకల పొడి, అరచెక్క నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆప్ చేసి బాండీ మీద మూతపెట్టి వదిలేయండి.
-ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పును గ్రైండర్ లేదా మిక్సీలో వేసి ఉప్పు కూడా కొద్దిగా వేసి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మెత్తగా,ఫ్లఫ్పీగా రావాలి, కావాలనుకుంటే 2 టేబుల్ స్సూన్ల నీళ్లను గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో కలుపుకోండి. పిండి జారిపోకుండా,గట్టిగా ఉండకుండా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక పిండిని పాలప్యాకెట్ లో పిండిని నింపి ప్యాకెట్ కు ఒక మూలన రంధ్రం చేసి అయినా లేదా సాస్ బాటిల్ సహాయంతో అయినా లేదా చిల్లుల గరిటె సహాయంతో అయినా పిండిని ఆయిల్ లో వేసుకోవాలి. పిండి షేపు షేపు పొడవుగా ఉండేలా చూసుకోండి.
-క్రిస్పీగా, గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత బాండీలో వేగిన వాటిని తీసి ముందుగా రెడీ చేసుకున్న వేడి చక్కెర పాకంలో వేసుకొని 10 సెకన్ల పాటు ఉంచి తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి.అంతే ధారాక్షి స్వీట్ రెసిపి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
