మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!

ఈ రోజుల్లో మనం బతకాలంటే ఫుడ్ ఎంత ముఖ్యమో..స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యమైనదిగా మారిపోయంది. ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ లేని ఇళ్లు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పొద్దున్న నిద్ర లేచినదగ్గర నుంచి రాత్రి ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయేదాకా దాన్ని వాడుతూనే ఉండేవాళ్లు కోట్లమందే ఉన్నారు. కొన్ని ఇళ్లల్లో పిల్లలు అయితే ఫోన్ ఇవ్వకుంటే అన్నం కూడా తినట్లేదు.

అయితే స్మార్ట్ ఫోన్ వాడే చాలామంది ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య..ఫోన్ వేడెక్కడం. ఒక్కోసారి మనం ఫోన్ ని ఎక్కువగా వాడకపోయినా సరే ఫోన్ విపరీతమైన వేడిగా ఉండటం మనం గమనిస్తుంటాం. అయిత ఫోన్ హీట్ కి కేవలం దాన్ని తయారుచేసిన కంపెనీలే కారణం కాదు..మనం చేస చిన్న చిన్న తప్పులు కూడా దీనికి కారణం అవుతున్నాయి. మన అలవాట్లన కొంచెం మార్చుకుంటే ఫోన్ హీటింగ్ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

smartphone heating issues causes and solutions to keep phone cool

మొబైల్ కేస్ ఉంచే ఛార్జింగ్

దాదాపు అందరూ ఫోన్ సేఫ్టీ కోసం వేసే బ్యాక్ కవర్ ని అలాగే ఉంచి ఛార్జింగ్ పెడతారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఛార్జ్ అయ్యేటప్పుడు సహజంగానే బ్యాటరీ కోంత హీట్ రిలీజ్ చేస్తుంది. ఫోన్ కవర్ అలాగే ఉంచి ఛార్జింగ్ పెట్టడం వల్ల ఆ వేడి బయటకు పోలేక ఫోన్ తొందరగా వేడెక్కుతుంది. కాబట్టి ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాక్ కేస్ తీసేయడం బెటర్.

ఎండలో, ప్రయాణాల్లో ఫోన్ వాడకం

ప్రజెంట్ చాలామంది బైక్ లేదా కారు నడుపుతూ మొబైల్ హోల్డర్లలో ఫోన్ పెట్టి నావిగేషన్ కోసం వాడటం సాధారణం అయిపోయింది. ఇలా నేరుగా సూర్యరశ్మి, ఎండ తగిలే ప్రదేశాల్లో ఫోన్‌ ను పెట్టడం వల్ల ఆ డివైజ్ విపరీతంగా వేడెక్కుతుంది. ఎండలో ఫోన్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐఫోన్‌ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!ఐఫోన్‌ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!

ఛార్జింగ్ పెట్టి వాడటం

కొంతమంది ఫోన్ కి బానిసలైపోతారు. అందులో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టి మరీ దాన్ని వాడుతుంటారు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ లో గేమ్స్ ఆడటం, కాల్స్ మాట్లాడుతుండగా బ్యాటరీ పేలిపోయి చాలామంది చనిపోయిన ఘటనలు అనేకం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టినప్పుడు దానిని వాడటం వల్ల అటు బ్యాటరీ ఛార్జ్ అవుతూ, ఇటు ప్రాసెసర్‌ పై తీవ్రమైన భారం పడి ఫోన్ మరింత వేడెక్కుతుంది. దీంతో కొన్నిసార్లు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటది కాబట్టి ఛార్జింగ్ పూర్తయ్యే వరకు ఫోన్‌ ను పక్కన పెట్టేయడం మంచిది.

నకిలీ ఛార్జర్లు

ఒరిజినల్ ఛార్జర్ పాడైతే, తక్కువ ధరకు వస్తుందని మార్కెట్లో దొరికే నకిలీ ఛార్జర్లు, లోకల్ కేబుల్స్ వాడుతుంటారు కొందరు. వీటి వల్ల వోల్టేజీలో హెచ్చుతగ్గులు వచ్చి ఫోన్ దెబ్బతింటుంది. అలాగే అవసరం లేకపోయినా బ్లూటూత్, వైఫై, జీపీఎస్ ఆన్‌ లో ఉంచడం, బ్యాక్‌గ్రౌండ్‌లో పదుల కొద్దీ యాప్స్ రన్ అవ్వడం వల్ల ప్రాసెసర్‌ పై లోడ్ పడుతుంది.

ఫోన్ కూల్‌ గా ఉండాలంటే ఏం చేయాలి?

ఛార్జింగ్ పెట్టినప్పుడు గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచండి. దిండ్లు, బెడ్ పరుపుల కింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ అసలు చేయవద్దు.

ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌నే వాడండి.

మీ ఫోన్ సాఫ్ట్‌ వేర్, యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌ డేట్ చేసుకోండి. పాత వెర్షన్లలో ఉండే బగ్స్ వల్ల కూడా ఫోన్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది.

వాడనప్పుడు డేటా, లొకేషన్, వైఫై వంటివి ఆఫ్ చేసి ఉంచండి.

Story first published: Tuesday, September 22, 2026, 16:17 [IST]
Desktop Bottom Promotion