Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
పాతాళ లోకంలో శేషతల్పంపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణువు తన పయనాన్ని మార్చుకుని, వీపును తిప్పే అత్యంత పవిత్రమైన రోజు పరివర్తినీ ఏకాదశి. 2026 సెప్టెంబర్ 22న అంటే ఇవాళ వచ్చిన పరివర్తినీ ఏకాదశి విష్ణు భక్తులకు అత్యంత విశేషమైనది. జ్యోతిష్య శాస్త్ర పరంగా కూడా ఈ రోజున అద్భుతమైన, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి.
ఈ పవిత్ర రోజున బుధ, గురు గ్రహాలు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలో ఉండి అద్భుతమైన లాభ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీనికి తోడు రవి యోగం, శుక్ర యోగం కూడా తోడవ్వడం విశేషం. అంతేకాకుండా, కేవలం నాలుగు రోజుల క్రితమే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, గురుడితో కలిసి అత్యంత శక్తివంతమైన నీచభంగ రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ అద్భుత గ్రహస్థితుల కారణంగా ఏయే రాశుల వారి దశ తిరగబోతోందో ఇక్కడ చూడండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి అక్టోబర్ నెల ఒక అద్భుతమైన కానుకగా మారబోతోంది. గత కొంతకాలంగా మీకు రావలసి ఉండి, ఎక్కడో ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. మీ ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మీరు ఎప్పటినుంచో పూర్తి చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని నెరవేరుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఇది నిజంగా సువర్ణావకాశాల సమయం. కర్కాటక రాశిలోనే కుజ, గురు గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతున్న నీచభంగ రాజయోగం మీకు అపారమైన శుభాలను చేకూరుస్తుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ వేగం పుంజుకుంటుంది. ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కన్యా రాశి
సూర్యుడు, బుధుడు కన్యారాశిలో కలిసి ఉండటం వల్ల ఏర్పడుతున్న బుధాదిత్య రాజయోగం కన్యారాశి వారి ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుంది. మీలోని ప్రతిభను, సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, దృఢమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే విజయాలు మీ సొంతమవుతాయి.
మకర రాశి
ఈ రోజున చంద్రుడు మకర రాశిలోనే సంచరించడం, దానికి తోడు గురు గ్రహం మకర రాశిని వీక్షించడం వల్ల మీ వృత్తి, ఆర్థిక విషయాల్లో అనుకూల పవనాలు వీస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఖాయం. ముఖ్యంగా భవిష్యత్తు కోసం మీరు పెట్టే పెట్టుబడులు అద్భుతమైన రాబడిని ఇస్తాయి. కాబట్టి తెలివిగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అదృష్ట దేవత తలుపు తడుతోంది. ఈ సమయంలో మీ నైపుణ్యాలను, జ్ఞానాన్ని ఎంతగా పెంచుకుంటే, కెరీర్ లో అంత ఎత్తుకు ఎదుగుతారు. మీ ఆదాయ మార్గాలు పెరిగి, సంపద వస్తుంది. ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
