షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే!

షుగర్ వ్యాధికి మనదేశం ఇప్పుడు రాజధానిలా మారిపోయింది. ప్రపంచంలో మరేదేశంలో లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. అంతేకాకుండా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే దీనికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలా అనేక రకాల కారణాలు ఉంటాయి.

అయితే షుగర్ వ్యాధి రాగానే చాలామందికి వచ్చే మొదటి సందేహం..ఇకపై నేను అన్నం తినవచ్చా? తినకూడదా? ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ కి అన్నం లేని భోజనాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.. అది తింటే రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయన్నది వాస్తవమే. అయితే అలాగని అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ విపుల్ చెబుతున్నారు.

Can Diabetics Eat White Rice 5 Smart Rules to Keep Blood Sugar in Check

అన్నం తినే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ ఉన్నవారు కూడా నిశ్చింతగా అన్నం తినొచ్చని డాక్టర్ విపుల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో సూచిస్తున్నారు. ఆ స్మార్ట్ చిట్కాలేంటో చూడండి.

ఎంత తింటున్నామనేదే ముఖ్యం

షుగర్ పేషెంట్లు ప్లేటు నిండా అన్నం పెట్టుకుని తినడం కరెక్ట్ కాదు. మీరు తినే భోజనంలో అన్నం తక్కువగా ఉండాలి, కూరలు, పప్పులు ఎక్కువగా ఉండాలి. ఇలా పరిమాణాన్ని తగ్గించడం వల్ల శరీరంలోకి వెళ్లే కార్బోహైడ్రేట్ల శాతం తగ్గి, షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?

ఒట్టి అన్నం వద్దు.. సరైన జోడీ ముఖ్యం

కేవలం అన్నం, ఏదో ఒక కూరతో భోజనం ముగించేయకండి. అన్నంతో పాటు పీచుపదార్థాలు (ఫైబర్), ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పప్పులు, ఆకుకూరలు, మొలకలు లేదా సలాడ్లను మీ భోజనంలో కచ్చితంగా చేర్చుకోండి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవకుండా అడ్డుకుంటాయి.

ఈ కూలింగ్ ట్రిక్ ట్రై చేయండి

ఇది చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం. అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినకుండా కాసేపు చల్లారనివ్వాలి. లేదా వండిన అన్నాన్ని కాసేపు ఫ్రిజ్‌ లో ఉంచి, ఆ తర్వాత కాస్త వేడి చేసుకుని తినడం మంచిది. ఇలా చేయడం వల్ల అన్నంలోని స్టార్చ్‌(పిండిపదార్థం).. నిరోధక స్టార్చ్‌ గా మారి, షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా కాపాడుతుంది.

భోజనం చేసే క్రమాన్ని మార్చండి

తినే విధానంలో మార్పు కూడా చాలా అవసరం. ముందుగా ఫైబర్ ఉండే సలాడ్లు, కూరగాయలు తినాలి. ఆ తర్వాత ప్రోటీన్ కోసం పప్పు, పనీర్ లేదా గుడ్డు లాంటివి తీసుకోవాలి. చివరగా మాత్రమే అన్నం తినాలి. ఈ క్రమంలో తినడం వల్ల కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి.

భోజనం అయ్యాక కాస్త నడవండి

అన్నం తిన్న వెంటనే పడుకోవడం లేదా ఒకే చోట కూర్చోవడం చేయకూడదు. భోజనం పూర్తయిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. ఈ చిన్న అలవాటు భోజనం తర్వాత పెరిగే చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, September 22, 2026, 17:19 [IST]
Desktop Bottom Promotion