Latest Updates
-
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం!
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..
శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మనం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతుంటాం. అయితే, వీటితో పాటు మన పెద్దలు సూచించిన కొన్ని సంప్రదాయ పానీయాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో ప్రత్యేకమైనది గోండ్ కటీరా. దీనినే ఇంగ్లీషులో ట్రాగా కాంత్ గమ్ అని పిలుస్తారు. దీనికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. నీటిలో నానబెట్టగానే ఇది నీటిని పీల్చుకుని అచ్చం పారదర్శకమైన జెల్లీలా మారుతుంది.
గోండ్ కటీరా నీటిని అద్భుతంగా పీల్చుకుంటుంది కాబట్టి ఇది ఆహారంలో ఫైబర్ లా పనిచేసి జీర్ణక్రియకు సాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన ద్రవాలను అందించడంలో, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడటంలో ఉపయోగపడుతుంది. గోండ్ కటీరా డ్రింక్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోండ్ కటీరా డ్రింక్ తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న ముక్క లేదా ఒక టీస్పూన్ గోండ్ కటీరాను తీసుకుని శుభ్రంగా కడగాలి. దాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి.
-ఉదయానికి అది మెత్తటి, స్వచ్ఛమైన జెల్ లా మారుతుంది. అందులో ఇంకా ఏవైనా గట్టి ముక్కలు మిగిలి ఉంటే తీసేయాలి.
-ఇప్పుడు ఈ జెల్ ను ఒక గ్లాసు చల్లటి నీటిలో కలుపుకోవాలి. డ్రింక్ మరింత రుచిగా, సువాసనగా ఉండటానికి ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. తీపి ఇష్టపడేవారు కొద్దిగా తేనె లేదా తగినంత చక్కెర జోడించవచ్చు. మరింత కూల్ గా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది.
-అంతే గొండ్ కటీరా డ్రింక్ రెడీ.
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గోండ్ కటీరాను అతిగా తీసుకుంటే పొట్ట ఉబ్బరం, అజీర్తి, అసౌకర్యం వంటి
సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది నీటిని ఎక్కువగా పీల్చుకునే పదార్థం
కాబట్టి, దీన్ని తీసుకున్నప్పుడు రోజువారీ త్రాగే ద్రవాల పరిమాణాన్ని
కూడా పెంచాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక మందులు
వాడేవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు దీన్ని వాడే ముందు డాక్టర్ల సలహా
తీసుకోవడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
