Latest Updates
-
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే! -
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
కల్తీ లేని స్వచ్ఛమైన బొంబాయి రవ్వ.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండిలా! -
జిమ్ లేదు, ట్రెడ్ మిల్ లేదు.. ఇంట్లోనే నడిచి 14 కేజీలు తగ్గిన యువతి -
చుక్క నూనె, నెయ్యి లేకుండానే నోరూరించే రాజ్మా కర్రీ..ఈ ట్రిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి..వెంటనే 50 వీధి దీపాలు తొలగింపు..వీడియో చూడండి -
రోజుకు 2 స్పూన్లు చాలు..చలికాలంలో ఉక్కులాంటి బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్,సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
క్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదే -
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన టమాటా వెల్లుల్లి రైస్..బ్యాచిలర్స్ కు పండగే పండగ
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు!
ప్రతిరోజూ అల్పాహారంలోకి ఇడ్లీ, దోసెలతో అదే చట్నీ, సాంబార్ తిని విసుగు వచ్చిందా? అయితే ఇంట్లో ఉన్న ఉల్లిపాయలతోనే కమ్మని ఉల్లిపాయ కుర్మాను తయారు చేసుకోండి. హోటల్ రుచిని తలపించే ఈ కుర్మా వేడివేడి ఇడ్లీ, దోసెలతో అద్భుతంగా ఉంటుంది. నిజానికి దీని రుచికి ఇంట్లో వాళ్ళందరూ సాధారణంగా తినే దానికంటే కొంచెం ఎక్కువే తింటారు. ఉల్లిపాయ కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
వేయించి రుబ్బుకోవడానికి:
నూనె: 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయలు (తరిగినవి): 2
వెల్లుల్లి రెబ్బలు: 15
అల్లం: 1 అంగుళం
పచ్చిమిర్చి: 6
సోంపు: 1 టీస్పూన్
గసగసాలు లేదా వేరుశనగ: 1 టీస్పూన్
జీడిపప్పు: 6-8
తురిమిన కొబ్బరి: 2 టేబుల్ స్పూన్లు
నీరు: తగినంత

కుర్మా తయారీ కోసం:
నూనె: 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: 1 ముక్క
లవంగాలు: 4
యాలకులు: 2
బిర్యానీ ఆకు: 1
పెద్ద ఉల్లిపాయ: 1
కరివేపాకు: 1 రెమ్మ
టమాటాలు: 2
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు పొడి: పావు టీస్పూన్
ధనియాల పొడి: 2 టీస్పూన్లు
కారం పొడి: 1 టీస్పూన్
చికెన్ మసాలా: 1 టీస్పూన్
నీరు: 2-3 కప్పులు
కొత్తిమీర: కొద్దిగా
క్రిస్పీ సొరకాయ పూరీలు.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
తయారీ విధానం
-ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి.
-ఆ తర్వాత సోంపు, గసగసాలు లేదా వేరుశనగ, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. చివరగా తురిమిన కొబ్బరి కూడా వేసి వేయించి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
-వేయించిన పదార్థాలన్నీ చల్లారాక మిక్సర్ జార్ లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేడి చేసి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించండి.
-ఇప్పుడు మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి పచ్చి వాసన పోయేలా బాగా వేయించండి.
-చివరగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపండి. 2 నుండి 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నుండి 8 నిమిషాల పాటు బాగా ఉడికించండి.
-కుర్మా చిక్కగా ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లి కలిపితే ఘుమఘుమలాడే ఉల్లిపాయ కుర్మా రెడీ.
-అంతే, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కుర్మా రెడీ. దీనిని వేడివేడి ఇడ్లీ, దోసెలతో వడ్డించి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
