గుడ్డుతో భుర్జీ తయారీ : ఇంట్లో గుడ్లతో భుర్జీని ఎలా తయారుచేయాలి

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

గుడ్డుతో చేసే భుర్జీ ఉత్తర మరియు పశ్చిమ భారతంలో చాలా సాధారణ మరియు ప్రముఖమైన వంటకం. ఇది మిగతాచోట్ల కూడా మెల్లగా ప్రసిద్ధమైంది.దీన్ని పక్క వంటకంగా తయారుచేస్తారు,మరియు రోటీ లేదా చపాతీ, నాన్ తో కలిపి తింటారు. లేకపోతే నేరుగానే అలానే తినేస్తారు కూడా.

గుడ్డుతో చేసే భుర్జీకి ఎక్కువ కొత్త ప్రయోగాలు ఏం ఉండవు ఎందుకంటే దీన్ని గుడ్లను గిలకొట్టి,ఉడికించి మరియు ఉల్లిపాయను వేయించి చేస్తారు. ఇందులో వేసే మసాలా దినుసులు అన్నిటితో సరిగా కలిసి మంచి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. కొత్తిమీరతో ఆఖరున అలంకరణ ఈ వంటకాన్ని పూర్తిచేస్తుంది.

గుడ్డుతో భుర్జీని రోజులో ఎప్పుడైనా ఏ భోజనంతో అయినా తినవచ్చు. దీన్ని సాయంత్రం కేవలం బ్రెడ్ ముక్కలతో కలిపి స్నాక్ లాగా తినవచ్చు.

గుడ్డుతో భుర్జీని ఇంట్లో సులువుగా, త్వరగా వండుకోవచ్చు. వీడియోని చూసి, వివరంగా స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్ని చదివి రుచికరమైన గుడ్డు భుర్జీని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

Egg bhurji recipe
గుడ్డుతో భుర్జీ రెసిపి । ఎగ్స్ భుర్జీ తయారీ ఎలా । అండా భుర్జీ తయారీ । ఘాటైన గుడ్ల భుర్జీ రెసిపి
గుడ్డుతో భుర్జీ రెసిపి । ఎగ్స్ భుర్జీ తయారీ ఎలా । అండా భుర్జీ తయారీ । ఘాటైన గుడ్ల భుర్జీ రెసిపి
Prep Time
10 Mins
Cook Time
15M
Total Time
25 Mins

Recipe By: అర్చన వి

Recipe Type: సైడ్ వంటకం

Serves: ఇద్దరికి

Ingredients
 • గుడ్లు -3

  నూనె-4 చెంచాలు

  ఉల్లిపాయ-1

  పచ్చిమిర్చి -1

  అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ -1చెంచా

  ఉప్పు-1 చెంచా+ 1 ½ చెంచా

  జీలకర్ర -1చెంచా

  మిరియాల పొడి -1చెంచా

  కొత్తిమీర -అలంకరణకి

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. ఒక ఉల్లిపాయ తీసుకుని, పైన కింద కోయండి

  2. పైన తొక్క తీసేసి సగానికి కోయండి.

  3. మీకు కావాలంటే పైన గట్టిగా ఉండే భాగాన్ని తీసేయండి.

  4. నిలువుగా ఉల్లిపాయ ముక్కలు కోయండి.

  5. పచ్చిమిరపకాయను నిలువుగా సగానికి కోయండి.

  6. ఇంకా,2 అంగుళాల ముక్కలుగా కోయండి. పక్కన పెట్టుకోండి.

  7. వేడిచేసిన పెనంలో నూనెను వేయండి.

  8. నిలువుగా కోసిన ఉల్లిపాయలను వేసి నెరపండి.

  9. గోధుమరంగులోకి మారేదాకా వేయించండి.

  10. కోసిన పచ్చిమిర్చిని వేయండి.

  11. అల్లం వెల్లుల్లి పేస్టును చెంచా ఉప్పుతో కలిపి వేయండి.

  12. బాగా కలపండి.

  13. తర్వాత, గుడ్లను చాకుతో పగలకొట్టి, ఒకదాని తర్వాత ఒకటి పెనంలో వేయండి.

  14. ఒకటిన్నర చెంచాల ఉప్పును వేయండి.

  15. చెంచాడు జీలకర్ర మరియు మిరియాల పొడిని వేయండి.

  16. ఇప్పుడు గుడ్లను గిలకొట్టి, గరిటెతో పచ్చిగుడ్లు గట్టిపడేదాకా కలపండి.

  17. 6-7 నిమిషాలు అలానే మంటపై ఉడకనిచ్చి, భుర్జీ బంగారు రంగులోకి మారేదాకా ఉంచండి.

  18. కొత్తిమీరతో అలంకరించండి.

  19. గిన్నెలోకి తీసి వడ్డించండి.

Instructions
 • మంచి తాజా గుడ్లను వాడండి
 • ఉల్లిపాయలను ఎంతవరకూ వేయించాలో మీ ఇష్టం, గుడ్లను మాత్రం బాగా గిలకొట్టండి ఎందుకంటే మనం వాటిని ముందుగా ఉడికించకుండా నేరుగా వండేస్తున్నాం
 • సాధారణంగా, గుడ్లతో చేసే భుర్జీకి మరే కాయగూరలు జతచేయం. కావాలంటే నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు
Nutritional Information
 • సరిపోయే పరిమాణం - 1బౌల్
 • క్యాలరీలు - 190.5 క్యాలరీలు
 • కొవ్వు - 13.7 గ్రాములు
 • ప్రొటీన్ - 12 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 6.1గ్రాములు
 • ఫైబర్ - 1.4గ్రాములు

స్టెప్ బై స్టెప్ - గుడ్డుతో భుర్జీ ఎలా తయారుచేయాలి

1. ఒక ఉల్లిపాయ తీసుకుని, పైన కింద కోయండి

Egg bhurji recipe
Egg bhurji recipe

2. పైన తొక్క తీసేసి సగానికి కోయండి.

Egg bhurji recipe

3. మీకు కావాలంటే పైన గట్టిగా ఉండే భాగాన్ని తీసేయండి.

Egg bhurji recipe

4. నిలువుగా ఉల్లిపాయ ముక్కలు కోయండి.

Egg bhurji recipe

5. పచ్చిమిరపకాయను నిలువుగా సగానికి కోయండి.

Egg bhurji recipe
Egg bhurji recipe

6. ఇంకా,2 అంగుళాల ముక్కలుగా కోయండి. పక్కన పెట్టుకోండి.

Egg bhurji recipe

7. వేడిచేసిన పెనంలో నూనెను వేయండి.

Egg bhurji recipe

8. నిలువుగా కోసిన ఉల్లిపాయలను వేసి నెరపండి.

Egg bhurji recipe

9. గోధుమరంగులోకి మారేదాకా వేయించండి.

Egg bhurji recipe

10. కోసిన పచ్చిమిర్చిని వేయండి.

Egg bhurji recipe

11. అల్లం వెల్లుల్లి పేస్టును చెంచా ఉప్పుతో కలిపి వేయండి.

Egg bhurji recipe
Egg bhurji recipe

12. బాగా కలపండి.

Egg bhurji recipe

13. తర్వాత, గుడ్లను చాకుతో పగలకొట్టి, ఒకదాని తర్వాత ఒకటి పెనంలో వేయండి.

Egg bhurji recipe

14. ఒకటిన్నర చెంచాల ఉప్పును వేయండి.

Egg bhurji recipe

15. చెంచాడు జీలకర్ర మరియు మిరియాల పొడిని వేయండి.

Egg bhurji recipe
Egg bhurji recipe

16. ఇప్పుడు గుడ్లను గిలకొట్టి, గరిటెతో పచ్చిగుడ్లు గట్టిపడేదాకా కలపండి.

Egg bhurji recipe

17. 6-7 నిమిషాలు అలానే మంటపై ఉడకనిచ్చి, భుర్జీ బంగారు రంగులోకి మారేదాకా ఉంచండి.

Egg bhurji recipe

18. కొత్తిమీరతో అలంకరించండి.

egg-bhurji

19. గిన్నెలోకి తీసుకోండి. వడ్డించండి.

egg-bhurji
egg-bhurji
[ 4 of 5 - 79 Users]
Subscribe Newsletter