Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
Egg Burger: కొంచెం క్రంచీగా, మరింత సాఫ్టీగా.. చిన్నారుల కోసం స్పెషల్ ‘ఎగ్ బర్గర్’
పోషకాలు మెండుగా ఉండే ఉడకబెట్టిన గుడ్డు మీ డైట్‌లో ప్రతిరోజూ ఉండాల్సిందే. పెద్దలు ఇష్టంగా తింటారు సరే.. కానీ కొందరు చిన్నారులు కొన్ని రోజులకి ముఖం చాటేస్తారు. ఆమ్లెట్స్ తిన్నంత ఇష్టంగా బాయిల్డ్ ఎగ్‌ను తినలేరు. కానీ ఈ విధంగా చేసినట్లయితే ప్రతిరోజూ స్నాక్స్ సమయంలో లొట్టలేసుకుంటూ తింటారనడంలో ఏం సందేహం లేదు.

బాయిల్డ్ ఎగ్స్ తో ఎక్కువగా కూరలు, పులుసు, వేపుడు, మసాలా లేదా బిర్యానీ ఇలాంటివే ఎక్కువగా చేస్తుంటాం. కానీ ఉడకపెట్టిన గుడ్లతో స్నాక్స్ చాలా అరుదుగా చూస్తుంటాం. మీ పిల్లలకు సాయంత్రం సమయాల్లో చిరుతిండిగా ఈ ఎగ్ బర్గర్‌ను చేసిపెట్టారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ బర్గర్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
ఎగ్ బర్గర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడకబెట్టిన గుడ్లు
మయోనైజ్- ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి- ఒక టేబుల్ స్పూన్
సాల్ట్- ఒక టేబుల్ స్పూన్
టొమాటో స్లైస్- ఒకటి
ఆనియన్ స్లైస్- ఒకటి
పాలకూర- ఒక స్లైస్
క్యారట్- ఒక ముక్క

ఎగ్ బర్డర్ తయారీ విధానం
-ముందుగా ఉడకబెట్టిన గుడ్లను మంచిగా పొట్టుతీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని పొడవుగా రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత పచ్చసొనను వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ మయోనైజ్, మిరియాల పొడి జత చేయాలి. అనంతరం స్పూన్‌తో మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ముక్కలుగా చేసిన ఎగ్స్ మధ్యలో పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక ఎగ్ బైట్‌పైన ఆనియన్, టొమాటో, క్యారట్, పాలకూర ముక్కలు వరుసగా పేర్చి మళ్లీ దానిపై మరో ఎగ్ బైట్‌ను పెట్టాలి. ఇప్పుడు ఆ మొత్తం విడిపోకుండా టూత్ పిక్‌తో సెట్ చేసుకోవాలి.
-ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక వెరైటీ ఎగ్ బర్గర్ రెడీ.. బన్‌తో చేసే సాధారణ బర్గర్ తిని విసుగొచ్చి.. కొత్తదనంతో పాటు ఆరోగ్యం కోరుకునేవారికి ఎగ్ బర్గర్ మంచి స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
