Latest Updates
-
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే..
మనలో చాలామంది సాయంత్రం పూట స్నాక్ గా ఎక్కువగా బోండా,బజ్జీలు, వడలు వంటివి తింటుంటాం. అయితే ఓ సారి వీటిని పక్కన పెట్టి ఇంట్లోనే చీజీ గార్లిక్ బ్రెడ్ ట్రై చేసి చూడండి. బ్రెడ్ పైన కరిగిన చీజ్, వెల్లుల్లి సువాసనతో నోరూరించే ఈ రెసిపీని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ టీ టైమ్ స్నాక్స్ గానీ, పార్టీల సమయంలో స్టార్టర్ గానీ ఇది అద్భుతంగా ఉంటుంది.
చీజ్ సాగుతూ, వెల్లుల్లి ఫ్లేవర్ తో ఉండే దీనిని వేడివేడిగా తింటే ఆ మజాయే వేరు. దీనిని చూస్తేనే ఎప్పుడెప్పుడు నోట్లో పడుతుందా అని అనిపిస్తుంటది. చీజీ గార్లిక్ బ్రెడ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బ్రెడ్ పిండి కోసం
మైదా పిండి - ఒకటిన్నర కప్పులు (సుమారు 190 గ్రాములు)
ఇన్ స్టంట్ డ్రై ఈస్ట్ - 1 టీస్పూన్
చక్కెర - 1 టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
ఆలివ్ ఆయిల్ - 2 టీస్పూన్లు
గోరువెచ్చని నీళ్లు - అర కప్పు, 2 టేబుల్ స్పూన్లు పిండి
కలుపుకోవడానికి
గార్లిక్ బటర్ కోసం
వెల్లుల్లి రెబ్బలు - 25 నుండి 30 వరకు
ఆలివ్ ఆయిల్ - 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
వెన్న - 40 గ్రాములు
చిల్లీ ఫ్లేక్స్- 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
చీజ్ టాపింగ్ కోసం
తురిమిన మోజారెల్లా చీజ్ - 150 నుండి 200 గ్రాములు
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మైదా పిండి, ఇన్ స్టంట్ డ్రై ఈస్ట్, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నూనె వేసి, కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లను పోస్తూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండిని కనీసం 8 నుండి 10 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత పిండిపై మూత లేదా తడి గుడ్డని ఉంచి, దాని పరిమాణం రెట్టింపు అయ్యే వరకు ఒక వెచ్చని ప్రదేశంలో పక్కన పెట్టుకోవాలి.
-పిండి నానుతున్న సమయంలో, స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి, అవి మెత్తగా,లేత బంగారు రంగులోకి మారే వరకు నెమ్మదిగా వేయించాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ లో మెత్తటి వెన్న, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఘుమఘుమలాడే గార్లిక్ బటర్ రెడీ.
-రెట్టింపు పరిమాణానికి చేరుకున్న పిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి పిసికి, రెండు సమాన భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి భాగాన్ని పొడవాటి దీర్ఘచతురస్రం లేదా గుడ్డు ఆకారంలో రోలర్ సహాయంతో కాస్త మందంగా ఒత్తుకోవాలి.
-ఇప్పుడు ఒత్తుకున్న పిండి పైన సిద్ధం చేసుకున్న గార్లిక్ బటర్ ను ఒక మందపాటి పొరలా అన్ని వైపులా సమానంగా రాయాలి. ఆ తర్వాత దానిపైన తురిమిన మోజారెల్లా చీజ్ ను ఎక్కువగా చల్లుకోవాలి.
-ఓవెన్ ను ముందుగానే 180°C ఉష్ణోగ్రత వద్ద ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ను ఓవెన్ లో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. బ్రెడ్ అంచులు లేత బంగారు రంగులోకి మారి, పైన వేసిన చీజ్ పూర్తిగా కరిగి అద్భుతంగా కనిపించే వరకు ఉంచాలి.
-బేక్ అయిన గార్లిక్ బ్రెడ్ ను బయటకు తీసి, వేడిగా ఉన్నప్పుడే కత్తితో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
