Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మెదడు చురుగ్గా,ఎముకలను ఉక్కులా మార్చే పోషకాల రాగి జున్ను..ఎలా చేసుకోవాలంటే
కొద్దిసేపు కూర్చున్న కాళ్ల నొప్పులు, నుంచుంటే నీరసం,నడిస్తే కాళ్ల నొప్పులు అనే వాళ్లకి, ఎముకలు ధృఢంగా,ఉక్కుల మారాలనుకుంటే రాగి జున్ను తప్పక తినాల్సిందే. రాగి జున్ను అనేది దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాచుర్యం పొందిన ఒక సాంప్రదాయ, ఆరోగ్యకరమైన వంటకం. రాగి ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్, ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. రాగి జున్నును సాధారణంగా అల్పాహారంగా లేదా సాయంత్రం పూట చిరుతిండిగా తింటారు. రాగి జున్ను తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి జున్ను తయారీకి కావాల్సిన పదార్థాలు
-కొబ్బరి తురుము
-రాగులు
-బెల్లం
-యాలకల పొడి
-డ్రై ఫ్రూట్స్
-ఉప్పు

రాగి జున్ను తయారీ విధానం
-ముందుగా ఒక గ్లాసు రాగులు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని కనీసం 8 గంటలు నానబెట్టాలి.
-నానిన రాగులను శుభ్రంగా కడిగి వాటిని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే ముప్పావు గ్లాసు పచ్చి కొబ్బరి తరుము, 1 గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పాలు వడకట్టుకోవాలి. కనీసం 3-4 సార్లు పిప్పి మిగిలేదాకా వడపోసుకోవాలి.
-వచ్చిన పాలను చివరలో ఓ కాటన్ క్లాత్ లో వడకట్టి తీసుకోవాలి. ఈ పాలలో ఆర్గానిక్ బెల్లం లేదా ముప్పావు గ్లాసు చెరుకు పానకం వేసి కలిపండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిమీద ఈ పాలు బెల్లం మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టి 20-30 నిమిషాలు తక్కువ మంట మీద కలుపుతూ మరిగించాలి.
-తర్వాత అందులో రుచి కోసం పావు టీస్పూన్ యాలకల పొడి,కొంచెం ఉప్పు వేసి కలపండి.
-మిశ్రమం దగ్గరపడ్డాక అందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో పోసుకొని 1 గంట చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు రాగి జున్ను రెడీ.
రాగి జున్ను ప్రయోజనాలు
రాగి జున్ను కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. రాగి జున్నును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది పిల్లలలో ఎముకల పెరుగుదలకు, పెద్దలలో బోలు ఎముకల వ్యాధి నివారణకు సహాయపడుతుంది. వృద్ధులకు ఇది చాలా ముఖ్యమైనది. రాగిలో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది రక్తహీనతతో బాధపడుతున్న వారికి చాలా మేలు చేస్తుంది. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, తద్వారా రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా గర్భిణులకు,పెరుగుతున్న పిల్లలకు ఇది చాలా అవసరం. ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా మంచి ఆహారం. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రాగి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, ఇవి శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. ఇది రోజు మొత్తం స్థిరమైన శక్తి స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది, అలసటను తగ్గిస్తుంది. రాగిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
