ఇంట్లో ఫిష్ కట్ లెట్ తయారుచేయటం ఎలా ?

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

సంవత్సరంలో ఎప్పుడైనా చాలా మందికి ప్రత్యేకంగా బెంగాలీలకు చేప అత్యంత ప్రియమైనది. సాధారణంగా వారు ఇంటిలో చేప వంటకాలను ఎంతో ఇష్టంగా చేస్తూ మునిగిపోతారు. ఫిష్ కట్ లెట్ అనేది సాధారణంగా చేసుకొనే స్నాక్ రెసిపీ.

ఇక్కడ మేము సాయంత్రం స్నాక్ అయిన ఫిష్ కట్ ని సులభంగా మరియు తొందరగా ఎలా చేసుకోవాలో చెప్పుతున్నాం. మీరు కూడా ప్రయత్నించండి.

ఈ రెసిపీ మీకు మీ అతిధులకు బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ పార్టీలకు కూడా ఉత్తమంగా ఉంటుంది. ఫిష్ కట్ లెట్ కి టార్టార్ డిప్ లేదా పుదీనా చెట్నీ మంచి కాంబినేషన్. ఇక్కడ ఇంటిలో సులభంగా ఫిష్ కట్ లెట్ ఎలా తయారుచేయాలో వివరంగా ఉంది.

Fish Cutlet Recipe | How To Prepare Fish Cutlet At Home | Fish Cake Recipe | Homemade Fish Cutlet Recipe
ఫిష్ కట్ లెట్ రెసిపీ | ఇంటిలో ఫిష్ కట్ లెట్ తయారుచేయటం ఎలా ? | ఫిష్ కట్ లెట్ రెసిపీ | హోమ్ మేడ్ ఫిష్ కట్ లెట్ రెసిపీ
ఫిష్ కట్ లెట్ రెసిపీ | ఇంటిలో ఫిష్ కట్ లెట్ తయారుచేయటం ఎలా ? | ఫిష్ కట్ లెట్ రెసిపీ | హోమ్ మేడ్ ఫిష్ కట్ లెట్ రెసిపీ
Prep Time
15 Mins
Cook Time
35M
Total Time
50 Mins

Recipe By: పూజ గుప్త

Recipe Type: స్నాక్స్

Serves: 4

Ingredients
 • బంగాళాదుంపలు - అరకేజీ (కట్ చేసినవి)

  సార్డినెస్ చేపలు - 2 క్యాన్స్ (కట్ చేసినవి)

  తరిగిన పార్స్లీ - 4 టేబుల్ స్పూన్లు

  నిమ్మ రసం - 1 స్పూన్

  లేత మయోన్నైస్ - 3 టేబుల్ స్పూన్లు

  కొవ్వు రహిత గ్రీకు పెరుగు - 4 టేబుల్ స్పూన్లు

  సాదా పిండి - 1 టేబుల్ స్పూన్

  సన్ ఫ్లవర్ ఆయిల్ - 4 స్పూన్

  గ్రీన్ సలాడ్ మరియు నిమ్మ బద్దలు సర్వింగ్ కొరకు

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. బంగాళాదుంపలను ఉప్పు నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

  2. ఒక బౌల్ లో సార్డినెస్ చేప ముక్కలను కొంచెం మెత్తగా చేసుకోవాలి.

  3. దీనిలో 2 స్పూన్ల తరిగిన పార్స్లీ మరియు అర నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.

  4. మరొక బౌల్ లో మిగిలిన పార్స్లీ, నిమ్మ రసం, మయోన్నైస్, పెరుగు మరియు కొంచెం మసాలా వేసి కలపాలి.

  5. ఉడికిన బంగాళాదుంపలను మెత్తగా చేయాలి.

  6. దీనిలో సార్డినెస్ మిశ్రమాన్ని కలపాలి.

  7. ఈ చేప ముక్కలను పిండిలో దొర్లించాలి.

  8. నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ లో నూనె పోసి చేప ముక్కలు బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా 3-4 నిమిషాల పాటు వేగించాలి.

  9. అన్ని ముక్కలను ఇదే విధంగా వేగించాలి.

  10. తయారైన ఫిష్ కట్ లెట్ లను లెమన్ మయోన్నైస్, సలాడ్ మరియు నిమ్మ బద్దలతో సర్వ్ చేయాలి.

Instructions
 • 1. కాల్షియం-రిచ్ ఎముకలను సార్డినెస్ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి తినడానికి మృదువుగా ఉంటాయి.
Nutritional Information
 • సర్వింగ్ సైజు - - 1 పెద్ద కట్ లెట్
 • కేలరీలు - - 287 కేలరీలు
 • కొవ్వు - - 13 గ్రాములు
 • కార్బోహైడ్రేట్లు - - 29 గ్రాములు
 • షుగర్ - - 2 గ్రాములు
 • ఆహార ఫైబర్ - - 1 గ్రాము
[ 5 of 5 - 44 Users]
Subscribe Newsletter