Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
వేడి వేడి అన్నంలోకి మజ్జిగ పులుసు బోండా..కంచాలు కంచాలు లాగించేయడం గ్యారెంటీ!
కొన్ని వంటకాలు తింటుంటే.. ఎక్కడున్నా ఇంటి భోజనం గుర్తొస్తుంది, మనసు ఆనందంతో నిండిపోతుంది. అలాంటి ఓ అద్భుతమైన, కమ్మని వంటకమే మజ్జిగ పులుసులో నానబెట్టిన మినప బోండాల). కమ్మని మజ్జిగ పులుసులో దూదిలా మెత్తగా నానిన బోండాలను లాగిస్తుంటే.. ఆ మజాయే వేరు. దీని రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ కమ్మని వంటకాన్ని సులువుగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మజ్జిగ పులుసు మినప బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి - 2 లేదా 3
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం - అంగుళం ముక్క
మిరియాలు - అర టీస్పూన్
కరివేపాకు - గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
కందిపప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 2 టీస్పూన్లు
బియ్యం - 1 టీస్పూన్
మినపప్పు - 1 కప్పు
నీళ్లు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
సన్నగా తరిగిన కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - 1 (సన్నగా తరగాలి)
అల్లం - చిన్న ముక్క
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
పెరుగు - 1 కప్పు
నీళ్లు - అర కప్పు
ఉప్పు - తగినంత
కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండుమిర్చి - 4
కరివేపాకు - కొద్దిగా రెమ్మలు
మజ్జిగ పులుసు మినప బోండా తయారీ విధానం
-ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి 1 గంటసేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత బియ్యం, కందిపప్పు, పచ్చిశెనగపప్పు విడివిడిగా అరగంటసేపు నానబెట్టుకోవాలి.
-అరగంట తర్వాత మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి,జీలకర్ర,ధనియాలు,అల్లం,మిరియాలు,పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పచ్చి శెనగపప్పు,కరివేపాకు వేసి,కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా చిలకాలి. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి కలుపుతూ వేడి చేయాలి. మిశ్రమం పైకి నురగ వస్తున్నట్లు కనిపిస్తున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరగనివ్వకూడదు.
-మరోవైపు, గంటపాటు నానబెట్టిన మినపప్పును మిక్సీ గిన్నెలో వేసి చాలా తక్కువ నీళ్లు పోస్తూ గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, చేత్తో బాగా గిలకొట్టాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి, బోండాలు మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేసి, పిండిని చిన్నచిన్న బోండాలుగా వేసుకుని, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
-వేడివేడిగా ఉన్న బోండాలను తీసి, గోరువెచ్చగా ఉన్న మజ్జిగ పులుసులో వేయాలి.
-చివరగా నూనెలో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని, ఆ తాలింపును మజ్జిగ పులుసులో కలుపుకోవాలి.
-అంతే కమ్మని మజ్జిగ పులుసు మినప బోండా రెసిపి రెడీ. వేడివేడి అన్నంతో వడ్డిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications