బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు!

Posted By:

మన నాలుక ఎప్పుడూ కొత్త కొత్త రుచులను కోరుకుంటుంది. ఎప్పుడూ అవే రొటీన్ అన్నం, కూరలు, బిర్యానీ ఐటమ్స్ తింటుంటే నాలుకకు చిరాకు వేసి నాకు కొత్త రుచులను పరిచయం చేయండ్రా అంటూ తహతహలాడుతుంటుంది. అలా మీ నాలుక కొత్త రుచుల కోసం తహతహలాడుతుంటే ఒక్కసారి గార్లిక్ రైస్ ఇంట్లో చేయండి. ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేసేస్తారు.

ఈ గార్లిక్ రైస్ ఒక్కసారి చేసుకుంటే ఇక బిర్యానీల జోలికి వెళ్లరు. అంత రుచిగా ఉంటుందన్నమాట. లంచ్ బాక్సులలోకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. పైగా రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే బోలెడు పోషకాలు ఈ గార్లిక్ రైస్ లో ఉంటాయి. టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్ ను మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Forget Biryani Make This Super Tasty Healthy Garlic Rice in 10 Minutes Perfect Lunch Box Recipe

గార్లిక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-వెల్లుల్లి
-జీలకర్ర
-మిరియాలు
-ఉల్లిపాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఆయిల్
-వేరుశెనగపప్పు
-పచ్చి శెనగపప్పు
-కందిపప్పు
-ఉప్పు
-వండిన అన్నం

100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!

గార్లిక్ రైస్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి,అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి.

-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే ఆయిల్ లో 1 పెద్ద వెల్లుల్లి గడ్డ రెబ్బలను పొట్టు తీసేసి వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి.

-వేయించినవన్నీ చల్లారిన తర్వాత వెల్లుల్లితో సహా మెత్తం అన్నీ మీక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు కడాయిలో మిగిలిన ఆయిల్ లోనే కొద్దిగా జీలకర్ర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నని ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక అందులో గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు వేయించుకోవాలి.

-2 నిమిషాల తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపాక అందులో పొడి పొడిగా ఉన్న రైస్ ను వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసి మసాలా అంతా రైస్ కి పట్టేలా 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై ఉండాలి. తర్వాత స్టవ్ ఆపేయండి.

-అంతే సూపర్ టేస్టీ గార్లిక్ రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 23, 2026, 12:54 [IST]
Desktop Bottom Promotion