Latest Updates
-
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే! -
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు! -
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి -
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా.. -
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ -
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ!
దోశ, ఇడ్లీ, గారె, పెసరట్టులోకి మాములు చట్నీతో తింటే వచ్చే మజా కన్నా అల్లం చట్నీతో తింటే వచ్చ మజా వేరే లెవల్లో ఉంటుంది. అందులోనూ గుంటూరులో టిఫిన్ సెంటర్లలో రోడ్డు పక్కన టిఫిన్ బండ్లమీద వడ్డించే అల్లం పచ్చడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
గుంటూరు ఫేమస్ టిఫిన్స్ అల్లం పచ్చడితో ఇడ్లీ, దోశలను తింటుంటే స్వర్గమే. దీనిని తయారుచేయడం చాలా చాలా ఈజీ. రెగ్యులర్ గా ఇంట్లో పదార్థాలతోనే నెల రోజుల వరకు నిల్వ ఉండేలా గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ధనియాలు
-పచ్చి శగనపప్పు
-నూనె
-మినపప్పు
-ఎండుమిర్చి
-చింతపండు
-అల్లం
-బెల్లం
-జీలకర్ర
-వెల్లుల్లి
-ఉప్పు
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండిః
తయారీ విదానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి తక్కువ మంట మీద ఎర్రగా, మంచి సువాసన వచ్చేదాకా వేపుకోండి.
-తర్వాత అందులోనే 50 గ్రాముల ఎండుమిరపకాయలు వేసి వేపుకోండి. ఎండుమిర్చి వేగాక అందులోనే 50 గ్రాముల అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వేయించిన మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే 100 గ్రాముల బెల్లం తరుగు, 50 గ్రాముల చింతపండు చిక్కటి పులుసు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి,వేడి వేడి నీల్లు పోసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-అంతే టిఫిన్స్ అల్లం పచ్చడి రెడీ. ఏ టిఫిన్స్ తో అయినా దీన్ని అద్దుకుని తింటంటే వేరే లెవల్ మజా నోటికి లభిస్తుంది.
-చల్ల నీళ్లు పోసి రుబ్బుకుంటే పచ్చడి 4 రోజులకే పాడవుతుంది, కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేడి నీళ్లే పోసి గ్రైండ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన నూనె కనుక పచ్చడి పైన పోసుకుంటే 4 నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
