Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
మిగిలిన అన్నాన్ని ఇలా వాడారంటే.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే!
ఇంట్లో అన్నం వండినప్పుడు, ముఖ్యంగా బంధువులు లేదా స్నేహితులు వచ్చినప్పుడు కాస్త అన్నం మిగిలిపోవడం సహజం. రాత్రి పూట తక్కువ తినేవారు ఉండటం వల్ల కూడా ఈ పరిస్థితి తరచుగా ఎదురవుతుంది. అలాంటప్పుడు ఆ అన్నాన్ని పడేయలేక, సాధారణంగా ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్ లేదా పులిహోర చేస్తూ ఉంటాం. మరికొందరు దోశలు కూడా వేసుకుంటారు.
కానీ ఎప్పుడూ అవే వంటకాలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి మిగిలిపోయిన అన్నంతో గుజరాతీ స్పెషల్ ఢోక్లా తయారు చేసి చూడండి. దూదిలాంటి మెత్తదనం, నోరూరించే రుచితో నిమిషాల్లో తయారయ్యే ఈ రైస్ ఢోక్లాను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. దీన్ని సులభంగా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

రైస్ ఢోక్లా తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన అన్నం: 1 కప్పు
పెరుగు: అర కప్పు
బొంబాయి రవ్వ (సూజీ): అర కప్పు
పచ్చిమిర్చి: 3
ఉప్పు: రుచికి సరిపడా
ఈనో పౌడర్: 1 టీస్పూన్
కారం పొడి: కొద్దిగా
పంచదార: 1 టీస్పూన్
తాలింపుకి: నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, నువ్వులు,
పచ్చిమిర్చి.
రైస్ ఢోక్లా తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు మిగిలిపోయిన అన్నం, అర కప్పు పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో అర కప్పు బొంబాయి రవ్వను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ నానేందుకు ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-పిండి నానేలోపు, స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె లేదా ఇడ్లీ పాత్రను పెట్టి, అందులో నీళ్లు పోసి వేడి చేయండి. ఢోక్లాను ఉడికించే ప్లేటుకు లేదా అచ్చుకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి సిద్ధంగా పెట్టుకోండి.
-10 నిమిషాల తర్వాత, పిండి గట్టిపడితే కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ లేదా దోశ పిండి మాదిరిగా కలుపుకోండి. మరీ పలుచగా ఉండకూడదు. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. చివరగా ఈనో పౌడర్ వేసి, పిండిని నెమ్మదిగా కలపండి.
-వెంటనే ఆ పిండిని నూనె రాసిన ప్లేటులో పోసి, పైన కొద్దిగా కారం పొడిని చల్లండి. ఈ ప్లేటును వేడి నీళ్లు ఉన్న పాత్రలో పెట్టి, మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించండి.
-ఢోక్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, బయటకు తీసి చల్లారనివ్వండి. ఆ తర్వాత చాకుతో చదరంగా ముక్కలుగా కోసుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం చిన్న పాన్ లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, కొద్దిగా ఇంగువ, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి.
-గుజరాతీ ఢోక్లాకు ఆ తీపి, పులుపు రుచి రావాలంటే.. ఆ తాలింపులో కొద్దిగా నీళ్లు, ఒక చెంచా పంచదార వేసి మరిగించండి. ఈ తాలింపు సిరప్ ను సిద్ధం చేసుకున్నఢోక్లా ముక్కల మీద అన్నివైపులా పడేలా సమానంగా పోయండి.
-అంతే ఎంతో మృదువైన, రుచికరమైన రైస్ ఢోక్లా రెడీ. వేయించిన పచ్చిమిర్చి లేదా కొత్తిమీర చట్నీతో నంజుకుని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
