డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్‌ ఎగ్ రైస్‌.!

ఇంట్లో డిన్నర్‌లో మనుషులను బట్టి అంచనా వేసి వండినా ఎంతోకొంత అన్నం మిగలడం పక్కా. ఈ సంఘటన ప్రతి ఇంట్లో జరిగేదే. ఇక, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. నార్మల్‌గా అన్నం తినలేరు. నిమ్మకాయలు ఉంటే పులిహోర చేస్తారు. లేకపోతేనే అసలు ప్రాబ్లమ్‌. అలాంటప్పుడు ఇంట్లో గుడ్లు ఉంటే చాలు.. గుడ్లు అనగానే ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ అనుకుంటున్నారా.. అలాంటిదే.. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం మీరు మెతుకు వదలకుండా తినేస్తారు. అదే గ్రీన్‌ ఎగ్‌ రైస్‌.. చాలా సింపుల్‌గా, బ్యాచ్‌లర్స్‌ సైతం ఈజీగా చేసుకునేలా గ్రీన్‌ ఎగ్‌ రైస్‌ ఎలా చేసుకోవాలో చూద్దాం..

green egg rice with leftover rice healthy breakfast by adding mint leaves

గ్రీన్‌ ఎగ్‌ రైస్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

అన్నం- మూడు కప్పులు
కొత్తిమీర- కప్పు
పుదీనా- అర కప్పు
పచ్చిమిర్చి- మూడు
వెల్లుల్లి రెబ్బలు- పది
నూనె- ఏడు టేబుల్‌ స్పూన్లు
గుడ్లు- నాలుగు
జీలకర్ర- పావు టేబుల్‌ స్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బలు
మిరియాల పొడి- పావు టీస్పూన్‌
సోయాకూర- పిడికెడు
ఉప్పు- రుచికి సరిపడా
నిమ్మకాయ రసం- అర టీస్పూన్‌

గ్రీన్‌ ఎగ్‌ రైస్‌ తయారీ విధానం

మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..

ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని పొడిగా చేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో కడిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్‌ మాదిరిగా చేసుకోండి.

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో నాలుగు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగనివ్వండి. గుడ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి ఈ నూనెలో వేసి ఆమ్లెట్‌ మాదిరిగా రెండు వైపులా కాల్చుకోండి.

green egg rice with leftover rice healthy breakfast by adding mint leaves

దీనిని పక్కన పెట్టుకుని అదే కడాయిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పేస్ట్‌ వేసి బాగా వేగనివ్వండి. తర్వాత అన్నం, మిరియాల పొడి, ఆమ్లెట్‌ వేసి మొత్తం కలిసేలా గరిటెతో కలపండి.

కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్‌ కార్న్ రెడీ!

తర్వాత కొద్దిగా సోయాకూర(ఆప్షనల్‌) వేసి కలుపుకోవాలి. చివరిలో నిమ్మకాయ రసం కలిపి స్టవ్ ఆఫ్‌ చేసుకోవడమే.

టేస్టీ అండ్‌ హెల్తీ గ్రీన్‌ ఎగ్‌ రైస్‌ రెడీ. ఈ క్విక్‌ రెసిపీని ఉదయాన్నే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కాకపోయినా అన్నం వండి లంచ్‌ బాక్స్‌లోకి కూడా చేసుకోవచ్చు. గ్రీన్‌ ఎగ్‌ రైస్‌లో పుదీనా కలపడం వల్ల నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సోయాకూర కలపడం ద్వారా ఈ రెసిపీకి మరింత టేస్ట్‌ వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 23, 2026, 7:11 [IST]
Desktop Bottom Promotion