కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి!

కోడిగుడ్లతో ఎప్పుడూ ఆనియన్‌ ఎగ్స్‌, టమాటా ఎగ్స్‌, ఫ్రైడ్‌ రైస్‌, బిర్యానీ ఇలా ఎప్పుడూ ఈ వంటకాలేనా.. ఈ సారి కొత్తగా ఎగ్‌ బటర్‌ మసాలా ట్రై చేయండి. చపాతీ, బటర్‌ నాన్‌, బిర్యానీ, పులావ్‌లోకి అద్భుతంగా ఉంటుంది. పనీర్‌ బటర్‌ మసాలా కంటే ఈజీగీ ఈ రెసీపీని చేసేయొచ్చు.

Healthy and easy egg butter masala recipe for lunch and dinner know the easy process

ఎగ్‌ బటర్‌ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
వెన్న- మూడు టేబుల్‌ స్పూన్లు
పసుపు- పావు టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
కారం- నాలుగు టీస్పూన్లు
గుడ్లు- పది
జీలకర్ర- అర టీస్పూన్‌
మసాలా దినుసులు
మిరియాలు- అరటీస్పూన్‌
ఎండు మిర్చి- నాలుగు
వెల్లుల్లి- ఏడు
అల్లం- చిన్న ముక్క
ఉల్లిగడ్డలు- ఐదు
జీడిపప్పు- పది
టమాటాలు- మూడు
నీళ్లు- అర కప్పు
ధనియాల పొడి- టీస్పూన్‌
కసూరి మెంతి- టీస్పూన్‌
తాజా క్రీమ్‌- రండు టేబుల్‌ స్పూన్లు
గరం మసాలా- అర టీస్పూన్‌

ఎగ్‌ బటర్‌ మసాలా తయారీ విధానం

ముందుగా స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని టేబుల్‌ స్పూన్‌ నూనె, వెన్న వేసి కాగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి కలిపాక ఉడికించి పొట్టు తీసి గాట్లు పెట్టిన గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, వెన్న వేసి వేసి మసాలా దినుసులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి కలపాలి. మూడు ఉల్లిపాయలను పొడుగ్గా కట్‌ చేసి వేసి వేగిన తర్వాత టమాటాలు వేసి మగ్గించుకోవాలి.

తర్వాత రెండు టీస్పూన్ల కారం, ధనియాల పొడి, జీడిపప్పు పలుకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు కడాయి లేదా మందపాటి పాన్‌లో మిగిలిన నూనె, బటర్‌ వేసి కాగిన తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పేస్ట్‌ వేసి ఉడికించుకోవాలి.

అందులోనే రుచికి సరిపడా కారం, గరం మసాలాతో పాటు అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కలుపుకొని నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.

ఇప్పుడు గాట్లు పెట్టి వేయించుకున్న గుడ్లు వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. చివర్లో తాజా క్రీమ్‌, కసూరి మెంతి వేసి కాసేపు ఉడికించి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. అద్భుతమైన ఎగ్‌ బటర్‌ మసాలా రెడీ. చపాతీ, పులావ్‌, బిర్యానీలోకి ఈ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, October 5, 2026, 8:16 [IST]
Desktop Bottom Promotion