Latest Updates
-
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.!
బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్‌లోకి ఏం చేయాలి.. ఏం తినాలి అని చాలా హైరానా పడటం కామన్. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే టిఫిన్స్, చిరుతిళ్లేనా.. సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ అటుకుల వడలను ఈసారి ట్రై చేయండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా త్వరగా అయిపోవడంతో కిచెన్‌లో మీ పనిని సులభం చేస్తుంది. కప్పు అటుకులతో ఈ ఆరోగ్యకరమైన వడలు.. టిఫిన్ లేదా స్నాక్స్‌లోకి అద్భుతంగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ వడలు తింటే మినప గారెల రుచిని మరిచిపోతారంటే అతిశయోక్తి కాదు..

క్రిస్పీ అటుకుల వడ తయారీకి కావాల్సిన పదార్థాలు
అటుకులు- కప్పు
బంగాళాదుంపలు- రెండు(మీడియం సైజు)
ఉల్లిపాయ ముక్కలు- రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
మిరియాల పొడి- అర టీస్పూన్
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా కారం-
టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
చాట్ మసాలా- అర టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర- రెండు టీస్పూన్లు
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.!
క్రిస్పీ అటుకుల వడ కోటింగ్‌కి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి- రెండు టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి- రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
కారం- టీస్పూన్
కొత్తిమీర తురుము- కొద్దిగా
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
క్రిస్సీ అటుకుల వడ తయారీ విధానం
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులను ఒక బౌల్లోకి తీసుకుని మూడు సార్లు కడిగి నీళ్లు ఒంపేయాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత తేమగా ఉన్న అటుకులను గట్టిగా కలుపుతూ వీలైనంత వరకూ పొడిగా చేసుకోవాలి.
ఈ అటుకుల పొడిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, జీలకర్ర, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు బంగాళాదుంపల పొట్టు తీసి మెత్తగా చేసుకుని ఈ స్టఫ్‌లో వేసి మొత్తం కలిసేలా చేసి పిండి ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. వీటిని కట్లెట్స్ మాదిరిగా ఒత్తుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.

కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా కోటింగ్‌కి అనువుగా కలుపుకోవాలి.
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
స్టవ్‌పైన చిన్న బాణలి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత అటుకులతో చేసిన కట్లెట్లను ఒక్కొక్కదానిని పిండితో కోటింగ్ చేసి గరిటె సాయంతో నూనెలో వేసుకోవాలి.
అలా అన్నిటిని పిండిలో డిప్ చేసి నూనెలో వేసి కాల్చుకోవాలి. వెంటనే తిప్పకుండా రెండు నిమిషాల తర్వాత వడలను రెండో వైపు తిప్పాలి. అలా అన్నిటినీ మంచి రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.
అంతే క్రిస్టీ, సాఫ్ట్‌గా ఉండే అటుకుల వడలు రెడీ. వీటిని టమాటా సాస్‌తో అద్దుకుని తింటే ఆ రుచికి మైమరిచిపోవడం ఖాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
