Latest Updates
-
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.!
Beetroot Breakfast: దీన్ని మించిన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లేదు..బీట్ రూట్ ఇడ్లీ ఇలా చేసుకోండి
బీట్ రూట్ ని సాధారణంగా చాలామంది జ్యూస్ తాగడానికి లేదా ఫ్రై చేసుకోడానికి ఉపయోగిస్తుంటారు. అయితే బీట్ రూట్ తో అనేక రకాల రెసిపిలను తయారుచేసుకోవచ్చు. బీట్ రూట్ చపాతీ, బీట్ రూట్ దోశ ఇలా రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు. అలాంటి ఒక వెరైటీ రెసిపినే బీట్ రూట్ ఇడ్లీ. బీట్ రూట్ ఇడ్లీ అనేది ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం, ముఖ్యంగా బీట్ రూట్ తినడానికి ఇష్టపడని వారికి ముఖ్యంగా పిల్లలకు ఇది ఒక మంచి మార్గం. దీనికి రంగు, రుచి తో పాటు ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి.
బీట్ రూట్ ఇడ్లీని రెండు విధాలుగా చేసుకోవచ్చు..సంప్రదాయ పద్ధతిలో బియ్యం, మినప్పప్పుతో లేదా తక్షణ పద్ధతిలో ఇడ్లీ రవ్వతో. అయితే సంప్రదాయ పద్ధతిలో బీట్ రూట్ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

బీట్ రూట్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఇడ్లీ బియ్యం: 2 కప్పులు
-మినపప్పు: 1 కప్పు
-బీట్ రూట్: 1
-ఉప్పు: రుచికి సరిపడా
-నీరు: సరిపడినంత
తయారీ విధానం
-ముందుగా ఇడ్లీ బియ్యం, మినపప్పును విడివిడిగా కడిగి కనీసం 4-5 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఇది పప్పు, బియ్యం బాగా మెత్తబడటానికి సహాయపడుతుంది.
-నానబెట్టిన తర్వాత నీటిని తీసేసి మిక్సీ జార్ లో మినప్పప్పును వేసి కొద్దిగా నీటిని కలుపుతూ మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. అదే విధంగా ఇడ్లీ బియ్యాన్ని కొద్దిగా ముతకగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు మినప్పప్పు, బియ్యం పిండిని ఒక పెద్ద గిన్నెలో కలిపి బాగా కలిసేలా చూడాలి.
-ఈ పిండిని ఒక శుభ్రమైన గుడ్డతో కప్పి రాత్రంతా వెచ్చని ప్రదేశంలో పులియబెట్టండి. పిండి పరిమాణం రెట్టింపు అయ్యి కొద్దిగా పుల్లని వాసన వస్తే బాగా పులిసిందని అర్థం. ఇది ఇడ్లీలు మెత్తగా రావడానికి కీలకం.
-బీట్ రూట్ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పచ్చివాసన ఇష్టం లేని వారు బీట్ రూట్ ముక్కలను కొద్దిగా ఉడికించి లేదా నూనెలో వేయించి పేస్ట్ చేసుకోవచ్చు.
-పులిసిన ఇడ్లీ పిండిలో బీట్ రూట్ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి పిండిని 3/4 వంతు నింపండి. ఇడ్లీ కుక్కర్ లో నీరు పోసి వేడి చేసి అచ్చులను పెట్టి మూత పెట్టి సుమారు 10-15 నిమిషాలు మీడియం మంటపై ఆవిరి మీద ఉడికించాలి. ఇడ్లీలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ లేదా కత్తిని ఇడ్లీ మధ్యలో గుచ్చి చూడండి. అది శుభ్రంగా బయటకు వస్తే ఇడ్లీలు ఉడికినట్లే.
-ఇడ్లీలను అచ్చుల నుండి తీసే ముందు కొద్దిగా చల్లబరచండి. కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా మీకు నచ్చిన చట్నీతో వేడిగా ఈ బీట్ రూట్ ని ఆస్వాదించడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications