కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.!

తెలుగు సంప్రదాయ వంటకాల్లో పొంగలిది ప్రత్యేక స్థానం. మిరియాల ఘాటు, పప్పు రుచితో అద్భుతంగా ఉండే ఈ వంటకాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటాం. ఇంకా గుడిలో ప్రసాదంగా అందుకుంటాం. ఇక, పొంగలి అంటే అందులో బియ్యం, పప్పు, మిరియాలు, నెయ్యి సాధారణంగా వాడుతూనే ఉంటాం. కడుపులో చెత్తను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ పొంగలిని తరచూ తీసుకుంటే మేలు చేస్తుంది. అయితే ఈ సారి పొంగలి చేసేటప్పుడు ఇలా కొత్తిమీరతో చేయండి. రుచికి రుచి, శక్తిని సొంతం చేసుకోవచ్చు.

Healthy breakfast Coriander Pongal cleanses wastage in stomach know the easy process

కొత్తిమీర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం- అర కప్పు
పెసర పప్పు- అర కప్పు
కొత్తిమీర- కప్పు
కరివేపాకు- మూడు రెబ్బలు
పచ్చిమిర్చి- మూడు
నీళ్లు- మూడు కప్పులు
పసుపు
ఉప్పు- టీస్పూన్‌
నెయ్యి- పావు కప్పు
జీడిపప్పులు- పావు కప్పు
మిరియాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
తరిగిన అల్లం- టీస్పూన్‌
ఇంగువ- కొద్దిగా
కరివేపాకు- రెండు రెబ్బలు

కొత్తిమీర పొంగల్‌ తయారీ విధానం

ముందుగా బియ్యం, పెసరపపప్పును రెండు సార్లు కడిగి నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో కట్‌ చేసి కడిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు కుక్కర్‌ తీసుకుని అందులో బియ్యం, పప్పు వేసి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. పసుపు, ఉప్పు, టీస్పూన్‌ నెయ్యి వేసి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించుకోవాలి. విజిల్స్‌ పూర్తయ్యాక ఆవిరి పోయేవరకు ఉంచాలి. తర్వాత మూత తీసి ఉడికిన మిశ్రమాన్ని కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వేడి నీళ్లు కలుపుకోవచ్చు.

Healthy breakfast Coriander Pongal cleanses wastage in stomach know the easy process

స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని వేడయ్యాక నెయ్యి వేసి కాగనివ్వాలి. అందులో జీడిపప్పులు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత తరిగిన అల్లం, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత పొంగలిలో కలుపుకోవడమే. టేస్టీ అండ్‌ హెల్తీ కొత్తిమీర పొంగలి రెడీ.

చెడు కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నవారు, డయాబెటిస్‌, బీపీకి మందులు వాడుతున్నవారు తమ డైట్‌లో కొత్తిమీర పొంగలిని చేర్చుకుంటే ఈ సమస్యలన్నీ అదుపులో ఉంటాయి. లివర్‌, కిడ్నీలు సక్రమంగా పనిచేస్తూ కడుపులోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇంకా బరువును నియంత్రణలో ఉంచుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సౌందర్యానికి కొత్తిమీర అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Friday, October 2, 2026, 6:00 [IST]
Desktop Bottom Promotion