Latest Updates
-
ఇంటిల్లిపాదీ ఫిదా అయ్యే మినుముల చట్నీ..ఇడ్లీ, దోసెలతోనే కాదు అన్నానికి కూడా పర్ఫెక్ట్! -
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు -
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సొంత జెండా, కరెన్సీ ఉన్నా.. వరల్డ్ మ్యాప్ లో లేని రహస్య దేశాలు ఇవే! -
భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు! -
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి -
చికెన్ కబాబ్ బిర్యానీ..ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎప్పుడూ తిని ఉండరు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
మూత్ర విసర్జన చేసిన వెంటనే మళ్లీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అసలు కారణాలు ఇవే!
బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా..
బరువు తగ్గాలనుకునే వారి డైట్ లో ఓట్స్ ఇప్పుడు ప్రధాన అల్పాహారంగా మారాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఉదయాన్నే తింటే చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. కానీ చాలా మంది దీనిని గంజి రూపంలో తినడం వల్ల ఓట్స్ ను ఇష్టపడరు.
అయితే ఓట్స్ తో నోరూరించే కమ్మటి ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? సరైన పద్ధతిలో వండితే ఓట్స్ ఉప్మా పొడిపొడిగా, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మాను సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఇన్ స్టంట్ ఓట్స్ - 1 కప్పు
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
జీడిపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
జీలకర్ర పొడి - చిటికెడు
పసుపు పొడి - అర టీస్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం - చిన్న ముక్క
క్యారెట్ - సగం (సన్నగా తరిగినది)
నీళ్ళు - ఒకటిన్నర కప్పులు
తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి, అందులో 2 టీస్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇన్ స్టంట్ ఓట్స్, బొంబాయి రవ్వ వేసి, కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, జీడిపప్పు (లేదా వేరుశెనగలు), కరివేపాకు, జీలకర్ర పొడి వేసి తాలింపు పెట్టండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు బాగా వేయించండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి.
-4 నిమిషాల తర్వాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు పొడి వేసి నీటిని బాగా కలపండి. నీళ్ళు మరగడం మొదలయ్యాక వేయించిన ఓట్స్, బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి, సమానంగా పరచి మూత పెట్టండి. తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించండి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి, చివరగా తురిమిన పచ్చి కొబ్బరి చల్లి మరోసారి కలిపితే కమ్మటి ఓట్స్ ఉప్మా రెడీ.
-బరువు తగ్గాలనుకునే వారికే కాదు, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ ఓట్స్ ఉప్మా అల్పాహారంగా ఎంతో బాగా నచ్చుతుంది. పోషకాలు మెండుగా ఉండే ఈ వంటకాన్ని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
