తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రోజూ అవే తెల్ల ఇడ్లీలు లేదంటే రాగి ఇడ్లీలు తిని తిని ఇడ్లీలంటేనే విసుగొచ్చేసిందా? అయితే ఈసారి కొత్తగా నల్ల ఇడ్లీ ట్రై చేసి చూడండి. ఎన్నో పోషకాలు ఉన్న నల్ల బియ్యంతో తయారుచేసే ఈ ఇడ్లీలు సూపర్ టేస్ట్ తో పాటు శరీరానికి అసలైన శక్తిని అందిస్తాయి. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. పైగా ఇందులో ఫైబర్ తో పాటు ఎన్నో సహజసిద్ధమైన మొక్కల సమ్మేళనాలు మెండుగా ఉంటాయి.

ఈ ఇడ్లీ ప్రత్యేకత కేవలం దాని ముదురు రంగులో మాత్రమే లేదు.. సరైన పద్ధతిలో రుబ్బి, పులియబెడితే తెల్ల ఇడ్లీల కంటే కూడా ఇవి అత్యంత మృదువుగా, స్పాంజిలాగా వస్తాయి. మొదటిసారి చేసేవారు పిండి రుబ్బేటప్పుడు కాస్త ఓపికగా ఉంటే చాలు, అద్భుతమైన ఆకృతిలో ఇడ్లీ వస్తుంది.

Healthy Super tasty Black idli Recipe How to Make Black Rice Idli at Home in Telugu

నల్ల బియ్యం ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-నల్ల బియ్యం
-మినపప్పు
-మెంతులు

ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా!

నల్ల బియ్యం ఇడ్లీ తయారీ విధానం

-ముందుగా 2 కప్పుల నల్ల బియ్యం, 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. వీటిని విడివిడిగా శుభ్రంగా కడిగి, రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరింత మృదుత్వం కోసం మినపప్పులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కలుపుకోవచ్చు.

-మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి, రెండింటినీ విడివిడిగా రుబ్బుకోవాలి. ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. నల్ల బియ్యాన్ని రుబ్బేటప్పుడు ఒకేసారి నీళ్లు పోయకుండా, కొద్దికొద్దిగా పోస్తూ తరచుగా కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండి ఎంత నునుపుగా వస్తే ఇడ్లీలు అంత బాగా వస్తాయి. ఆ తర్వాత ఈ రెండు మిశ్రమాలను ఒక పెద్ద గిన్నెలో బాగా కలిపి, మూతపెట్టి 10 నుంచి 12 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి.

-వాతావరణం చల్లగా ఉంటే పులియడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. పిండి బాగా పొంగి, రెట్టింపు అయ్యాక తగినంత ఉప్పు కలపాలి. మరింత మృదువుగా కావాలనుకుంటే పావు టీస్పూన్ బేకింగ్ సోడా కలుపుకోవచ్చు.

-ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ అచ్చులలో వేసి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఉడికిన వెంటనే కాకుండా, కొన్ని నిమిషాలు చల్లారాక తీస్తే ఇడ్లీలు విరిగిపోకుండా వస్తాయి.

-ఈ ఇడ్లీలు కేవలం ఇంట్లో ఉదయపు అల్పాహారానికే కాదు, సుదూర ప్రయాణాలకు కూడా అద్భుతంగా పనికొస్తాయి. ముందుగానే వీటిని తయారుచేసి గాలి చొరబడని డబ్బాలో ప్యాక్ చేసుకోవచ్చు. అయితే చట్నీని మాత్రం విడిగా వేరే డబ్బాలో ఉంచుకోవడం మంచిది. వేడి వాతావరణంలో ప్రయాణిస్తున్నట్లయితే, ఇవి త్వరగా పాడవకుండా చల్లని ప్రదేశంలో ఉంచుకోవాలి.

[ of 5 - Users]
Story first published: Thursday, August 27, 2026, 11:49 [IST]
Desktop Bottom Promotion