Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే స్వీట్ కార్న్ వడ.. రుచితో పాటు ఇమ్యూనిటీ కూడా!
పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రతిరోజూ పిల్లల స్నాక్స్ బాక్స్ లో ఏ ఆరోగ్యకరమైన చిరుతిండి పెట్టాలా అనే ఆలోచన ప్రతీ తల్లిని వేధిస్తుంటుంది. మరోవైపు, సాయంత్రం కాగానే వేడి వేడి టీతో పాటు కరకరలాడే స్నాక్స్ తినడం మనందరికీ ఉన్న అలవాటే. ఈ రెండు సందర్భాలకు సరిగ్గా సరిపోయే అద్భుతమైన, నోరూరించే స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ వడ(మొక్కజొన్న వడలు). పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే.

స్వీట్ కార్న్ వడలు తయారీకి కావలసిన పదార్థాలు
స్వీట్ కార్న్ (తీపి మొక్కజొన్న కంకులు) - 2
బియ్యం పిండి - 1 కప్పు
శనగపిండి - పావు కప్పు
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
క్యాప్సికమ్ - సగం
పచ్చిమిర్చి - 3
వెల్లుల్లి - 6 రెబ్బలు
అల్లం - చిన్న ముక్క
పసుపు - పావు టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఆమ్ చూర్ (ఎండు మామిడి) పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కరివేపాకు - కొద్దిగా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో స్వీట్ కార్న్ గింజలను వేసి సుమారు 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన గింజలను నీళ్లు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఆ గింజలను మిక్సీ జార్ లో వేసి, నీళ్లు పోయకుండా బరకగా (కచ్చాపచ్చాగా) మిక్సీ పట్టుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, వెల్లుల్లి, అల్లం తరుగు, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్ చూర్ పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంగువ తగినంత ఉప్పు వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి.
ఐదు నిమిషాల తర్వాత, చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడల ఆకారంలో గుండ్రంగా వత్తుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోడి వేడి చేయాలి. నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, వత్తుకున్న వడలను నిదానంగా నూనెలో వేయాలి.
వడలు రెండు వైపులా తిప్పుతూ, మంచి బంగారు గోధుమ రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చి కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
వేడివేడిగా, కరకరలాడే మొక్కజొన్న వడలు రెడీ. వీటిని టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో వడ్డిస్తే, పిల్లలు స్నాక్స్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి వస్తారు. పెద్దలు కూడా సాయంత్రం టీతో ఈ వడలను ఆస్వాదిస్తూ అద్భుతమైన సమయాన్ని గడపవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు
ఈ స్వీట్ కార్న్ వడ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
స్వీట్ కార్న్: ఇందులో ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పిల్లలకు రోజంతా చురుకుగా ఉండటానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి.
కూరగాయలు: ఇందులో వాడే క్యారెట్, క్యాప్సికమ్ ద్వారా విటమిన్ ఎ, విటమిన్ సి లభిస్తాయి. ఇవి కంటి చూపును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
శనగపిండి: ఇది ప్రోటీన్లకు మంచి మూలం. పిల్లల కండరాల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
