ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..

Posted By:

మన పూరీక్వులు ఒక మాట తరచుగా చెబుతుండేవాళ్లు,అదేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని. కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వేస్టే. ఆరోగ్య సృహ పెరిగి ఇటీవల కాలంలో చాలామంది బియ్యం, గోధుమలు తగ్గింయి వాటి ప్లేస్ లో జొన్నలు, రాగులు, సజ్జలు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు, తద్వారా అనేక రోగాల ముప్పు నుంచి తప్పించుకుంటున్నారు. ఈముఖ్యంగా చుక్క నూనె లేకుండా చేసే వంటకాల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

చుక్క నూనె లేకుండా హెల్తీ జొన్న ఆవిరి కుడుము ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అద్భుతమైన రుచితో పాటు ఆరోగయం మీ సొంతం అవుతుంది. పిల్లలకు, పెద్దలు, వృద్ధులకు అన్ని వయస్సుల వారికి ఈజీగా జీర్ణమయ్యే రెసిపి ఇది. వీటిని సాయంత్రం స్నాక్ గా అయినా లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అయినా తినొచ్చు. దూదిలా మెత్తగా ఉండేలా జొన్న ఆవిరి కుడుము మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

High protein more fiber zero oil breakafst and snack healthy jonna aviri kudumu recipe in telugu

జొన్న ఆవిరి కుడుము తయారీకి కావాల్సిన పదార్థాలు

-1 గ్లాసు పెసలు
-అర గ్లాసు జొన్నలు
-పావు గ్లాసు మినపప్ను
-ఉప్పు

పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా

జొన్న ఆవిరి కుడుము తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 గ్లాసు పెసలు, అర గ్లాసు జొన్నలు, పావు గ్లాసు మినపప్పు వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగి ఆ నీటిని వంపేసి, తర్వాత అందులో మంచినీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. షుగర్ ఉన్నవాళ్లు ఇందులో తెల్ల జొన్నలకు బదులు పచ్చ జొన్నలు కూడా వేసుకోవచ్చు, అలాగే మినపప్పుకి బదులు పొట్టు ఉండే మినపప్పు కూడా వేసుకోవచ్చు.

-రాత్రంతా అవి నానబెట్టిన తర్వాత ఆ పప్పును గ్రైండర్ లో లేదా రోట్లో వేసి రుబ్బుకోండి. పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకుండా చాలా కొద్దిగా మాత్రమే పోసుకోండి. రుబ్బేటప్పుడే అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.

-పిండి రుబ్బుకున్న వెంటనే ఆవిరి కుడుము వేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి అందులో 2 కప్పుల నీళ్లు పోసి,దాని మీద చిల్లుల్ల ప్లేట్ పెట్టుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టుకోండి. తర్వాత నీళ్లల్లో గట్టిగా పిండేసిన కాటన్ గుడ్డని ఆ స్టాండ్ మీద పరుచుకోండి.

-ఇప్పుడు స్టాండ్ మీద ఉన్న గుడ్డలో పిండి మిశ్రమం వేసి కొంచెం మందంగా వేసుకుని ఇడ్లీ పాత్ర మూతపెట్టి ఉడకనివ్వాలి తక్కువ మంట మీద 12-15 నిమిషాలు మాత్రమే ఉడికిస్తే అది బాగా ఉడుకుతుంది.

-తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

-అంతే జొన్న ఆవిరి కుడుము రెడీ. దీని మీద వేడి వేడిగా నెయ్యి పోసుకుని నచ్చిన చట్నీతో తింటుంటే ఆహా ఓహో అని తీరాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Monday, November 2, 2026, 18:35 [IST]
Desktop Bottom Promotion